* ఉండవల్లిలో నివాసముండే చాందిని(18) అనే యువతి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందిఇంట్లో సమస్యల కారణంగా ఉరి వేసుకున్నట్లు బంధువులు తెలిపారుఅనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన తాడేపల్లి పోలీసులు
* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా….ములుగు జిల్లా నూగురు వెంకటాపూర్ మండల పరిధిలోని చర్ల సమీపంలోని తాలిపేరు ప్రాజెక్టు అటవీ ప్రాంతంలో మందుపాతర పేలింది.పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల వరకు వినపడింది.
* ఈత సరదా ఓ నవ వరుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పెళ్లయిన 28 రోజులకే కట్టుకున్న భార్యను, చేసిన బాసల్ని వదిలేసి వెళ్లిపోయాడు. పెళ్లి సందర్భంగా పార్టీ చేసుకుని అప్పటిదాకా మిత్రులతో సరదాగా గడిపాడు. తర్వాత కృష్ణా నదిలో ఈత కొట్టడానికి వచ్చి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన తాడేపల్లి పట్టణ పరిధిలోని కృష్ణా నది రైల్వే బ్రిడ్జి కింద ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం… విజయవాడ మాచవరం డౌన్‌లో నివాసం ఉండే గరికె కోటా వెంకట వరప్రసాద్(లేటు), లక్ష్మి పెద్దకొడుకైన గరికె సాయిఫకీర్ (22) తండ్రి చనిపోవడంతో ఎల్రక్టీషియన్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు
* ఏ.పి. ఎన్నికల కమీషన్ పై సి.ఐ.డి. అధికారులు నమోదు చేసిన కేసుపై విచారణ ప్రక్రియలో ముందుకు వెళ్ళొద్దని ఆదేశించిన హైకోర్టు.
* ఐనంపూడికి బయలుదేరిన టీడీపీ నేతలను పామర్రు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.దళితులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దళితులను పరామర్శించేందుకు టీడీపీ నేతలు ఛలో ఐనంపూడి కార్యక్రమానికి బయలుదేరారు.వర్ల రామయ్య ఆధ్వర్యంలో విజయవాడ నుంచి టీడీపీ, దళితనేతలు బయలుదేరారు.మైలవరం, రెడ్డిగూడెం మండలం వద్ద వారిని పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లాలంటూ పోలీసులు విజ్ఞప్తి చేశారు.ఘటనకు కారణమైన వారిని అరెస్ట్ చేసేవరకు వెనక్కి వెళ్లేదిలేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.నిందితులను అరెస్టు చేయాలనడం తప్పా? ప్రతిపక్షంగా తమ బాధ్యతని అన్నారు.