Agriculture

తెలంగాణా రైతులకు రెవెన్యూ పీడ విరగడ

తెలంగాణా రైతులకు రెవెన్యూ పీడ విరగడ

కొత్త రెవెన్యూ చట్టం దిశగా తెలంగాణ ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్నం 12 లోగా వీఆర్వోల రికార్డులు అప్పగించాలని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. మొత్తం ప్రక్రియ మధ్యాహ్నం 3లోగా పూర్తికావాలన్నారు. రెవెన్యూ చట్టానికి సంబంధించిన ముసాయిదా బిల్లును ఇవాళ్టి నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో పెట్టే అవకాశముంది.