* ప్రజలకు కొవిడ్ వ్యాక్సిన్ వేయడాన్ని ప్రారంభించిన రష్యా!కరోనా వైరస్ ను పారద్రోలేందుకు రష్యాకు చెందిన గమేలియా నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎపిడమాలజీ అండ్ మైక్రోబయాలజీ, (ఆర్డీఐఎఫ్) రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తొలి బ్యాచ్ ని విడుదల చేసిన ప్రభుత్వం, దాన్ని ప్రజలకు సరఫరా చేయడాన్ని ప్రారంభించింది. పౌర అవసరాల నిమిత్తం వ్యాక్సిన్ ను విడుదల చేశామని, ప్రాంతాల వారీగా వీటిని పంపిణీ చేసే ప్రక్రియ సాఫీగా సాగేలా చూస్తున్నామని, దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిబంధనలకు అనుగుణంగా పంపిణీ జరుగుతుందని అధికారులు వెల్లడించారు.”కరోనా సోకకుండా అడ్డుకునే తొలి బ్యాచ్ గామ్-కోవిడ్ వాక్ (స్పుత్నిక్ వీ) అన్ని ల్యాబొరేటరీ క్వాలిటీ టెస్ట్ లను అధిగమించి, రోస్ డ్రావన్ డ్జోర్ (మెడికల్ డివైస్ నియంత్రణా మండలి) అనుమతులతో పౌర సమాజానికి అందుబాటులోకి వచ్చింది” అని రష్యా ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా, ప్రపంచంలోనే కరోనా సోకకుండా తొలి వ్యాక్సిన్ ను తయారు చేసింది తామేనని గత నెల 11న ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, వ్యాక్సిన్ ను రిజిస్టర్ చేసిన సంగతి తెలిసిందే.ఇక ఈ వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా పలువురు సైంటిస్టులు అనుమానాలను వ్యక్తం చేసినా, రష్యా మాత్రం ఎవరి విమర్శలనూ పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తెచ్చినట్టు ప్రకటించింది. సమీప భవిష్యత్తులోనే రష్యా రాజధాని మాస్కో నగరవాసులందరికీ వ్యాక్సిన్ పంపిణీని పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు మాస్కో మేయర్ సెర్గి సొబ్యానిన్ వెల్లడించారు.
* భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.గడిచిన 24గంటల్లో అత్యధికంగా 1133మంది కరోనా రోగులు మృత్యువాతపడ్డారు.ఒక్కరోజులో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి.దీంతో దేశంలో కరోనా సోకి మరణించిన వారిసంఖ్య 72,775కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది.దేశవ్యాప్తంగా కొవిడ్‌తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని ప్రభుత్వం పేర్కొంది.ఇక దేశంలో రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య 90వేలకు చేరిన విషయం తెలిసిందే. అయితే, నిన్న ఒక్కరోజు ఈ సంఖ్య కాస్త తగ్గింది.
* Single-day spike of 75,809 new #COVID19 cases & 1,133 deaths reported in India, in the last 24 hours.The total case tally stands at 42,80,423 including 8,83,697 active cases, 33,23,951 cured/discharged/migrated & 72,775 deaths: Ministry of Health
* తెలంగాణలో కొత్తగా 2,392 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,45,163కు పెరిగింది. సోమవారం రాత్రి 8 గంటల వరకూ నమోదైన కొవిడ్ సమాచారాన్ని వైద్యఆరోగ్యశాఖ మంగళవారం విడుదల చేసింది. రాష్ట్రంలో సోమవారం 60,923 నమూనాలను పరీక్షించారు. తాజాగా కరోనా నుంచి 2,346 మంది కోలుకోగా ఇప్పటివరకూ కోలుకున్నవారి సంఖ్య 1,12,587కు చేరుకుంది. మరో 11 మంది కొవిడ్‌తో మృతిచెందగా.. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 906కు పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనాతో 31,670 మంది చికిత్స పొందుతున్నారు.
* కేరళలోని తిరువనంతపురంలో దారుణం చోటుచేసుకుంది. హోం క్వారంటైన్ పేరుతో తనపై ఆరోగ్య అధికారి అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ మహిళ ఆరోపించడం సోమవారం కలకలం సృష్టించింది. ఈ ఘటన కేరళలోని పంగోడే పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. మలప్పురంలో 44 ఏళ్ల మహిళ హోం నర్సుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఆమె విధులు ముగించుకుని తన ఇంటికి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో ఓ ఆరోగ్య అధికారి(హెల్త్ ఇన్‌స్పెక్టర్) ఆమెను క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా సూచించారు.