శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ నిర్వహణలో మరియు వివిధ దేశ తెలుగు సాహితీ సంస్థల సౌజన్యముతో 10 సెప్టెంబర్ 2020న ఉ.9.00 గం. నుండి రా.9.00 గం. వరకు అంతర్జాల వేదికలో జరుగబోయే విశ్వనాథ 125వ జయంతి వేడుకల కార్యక్రమము గౌరవనీయులు శ్రీ M. వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి వర్యులచే సదస్సు ప్రారంభ మగును. దేశ విదేశముల నుంచి ప్రముఖులు, రచయితలు, సాహితీవేత్తలు, ఆచార్యులు, యువకులు ఈ సదస్సు నందు పాల్గొంటున్నారని విశ్వనాధ వారి వారసులు సత్యనారాయణ, శక్తిధర, మనోహర్ ఒక ప్రకటనలో తెలిపారు మరియు కరోనా కారణంగా ప్రత్యక్షంగా చేయలేక యూట్యాబు (Youtube link https://bit.ly/322tdl9), ఫేస్బుక్ (Facebook Link https://bit.ly/3306ZiT) మాధ్యమాల ద్వారా ప్రసారం జరుగుతుందని తెలిపారు.
విశ్వనాథ సత్యనారాయణ
శ్రీ విశ్వనాథ ఫౌండేషన్ – అధ్యక్షులు