టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ల హీరో యువరాజ్ సింగ్ మరో ప్రఖ్యాత లీగ్‌పై కన్నేశాడు. ఆస్ట్రేలియా టీ20 లీగ్ ‘బిగ్‌బాష్’లో ఆడాలని కోరుకుంటున్నాడు. అతడి కోసం క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ఫ్రాంచైజీని వెతికే పనిలో పడిందని సమాచారం. ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మక క్రికెట్ లీగ్‌గా ‘బిగ్‌బాష్’కు పేరుంది. భారతీయులు మినహా ప్రపంచ దేశాల క్రికెటర్లు అందులో భాగం అవుతున్నారు. మహిళా క్రికెటర్లు మినహా పురుషులు ఇతర దేశాల లీగుల్లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇవ్వడం లేదు. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లకు మాత్రం అనుమతి ఇస్తోంది. సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, హర్భజన్ సింగ్ వంటి వెటరన్ క్రికెటర్లు తమకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన యువీ.. కెనడా టీ20 లీగ్, టీ10 వంటి లీగుల్లో ఆడాడు. కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం టోర్నీలేమీ జరగడం లేదు. ఎంతో కష్టపడితే గానీ ఐపీఎల్ వంటి లీగులు సాధ్యమవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ‘బిగ్‌బాష్’లో ఆడాలని అతడు నిర్ణయించుకున్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా యువీ కోసం ఓ ఫ్రాంచైజీని గుర్తించే పనిలో పడిందని అతడి మేనేజర్ జేసన్ వార్న్ (డబ్ల్యూ స్పోర్ట్స్, మీడియా) చెప్పినట్టు సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌లో ఓ కథనం వచ్చింది.
యువరాజ్ కోరిక తీర్చనున్న ఆస్ట్రేలియా
Related tags :