మాదకద్రవ్యాల వినియోగం, సరఫరా ఆరోపణలపై నటీమణులు రాగిణి ద్వివేది, సంజన అరెస్టు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరు కేంద్ర నేర నియంత్రణ దళం (సీసీబీ) విచారణ జరుపుతోంది. వీరిద్దరి వ్యవహారం అనేక మలుపులు తిరుగుతుండటంతో రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. అధికారులు మొదట రాగిణిని అదుపులోకి తీసుకున్నారు, ఆపై సంజనను కూడా అరెస్టు చేశారు. వీరిని కస్టడీలోకి తీసుకుని సీసీబీ విచారిస్తోంది. ఈ క్రమంలో డ్రగ్ టెస్ట్ కోసం సంజనను బెంగళూరులోని కేసీ సాధారణ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఆమె హంగామా చేశారు. డోప్ పరీక్ష చేయించుకోనంటూ వైద్యులకు సహకరించకుండా, పోలీసులతో వాదనకు దిగారు. ‘నన్నెందుకు అరెస్టు చేశారు? మీరంతా కలిసి నన్ను బకరాను చేశారు. నేనెలాంటి తప్పూ చేయలేదు. నన్నెందుకు అరెస్టు చేశారనే విషయం ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు’ అని కేకలు పెట్టారు.
సంజన కేకలు
Related tags :