Movies

నా ప్రేమ గురించి మీరు రాయకండి ప్లీజ్!

నా ప్రేమ గురించి మీరు రాయకండి ప్లీజ్!

‘మీరు సింగిలేనా?’ అని అడిగాడో అభిమాని రష్మికా మందన్నాను. ‘యస్‌ ఐయామ్‌ సింగిల్‌’ అన్నారు రష్మికా. అంతేకాదు సింగిల్‌గా ఉండటంలో ఉన్న ప్లస్‌లు, మైనస్సులు విశ్లేషించి చెప్పారు. ‘‘సింగిల్‌గా ఉండటం అనేది మన చాయిస్‌. మన కంపెనీని మనం బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు ఇంకొకరు ఎందుకు? మరో ముఖ్య విషయం ఏంటంటంటే… సింగిల్‌గా ఉంటూ బాగా ఎంజాయ్‌ చేయగలిగినప్పుడు, మనకు రాబోయే లవర్‌లో ఎలాంటి లక్షణాలు ఉండాలనే క్లారిటీ మనకు ఉంటుంది. మైనస్‌ ఏంటంటే… సింగిల్‌గా ఉంటే ఎవ్వరో ఒకరితో ప్రేమలో పడింది అనే వార్తలు వినాల్సి వస్తుంటుంది. అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రస్తుతానికి ఐయామ్‌ హ్యాపీ సింగిల్‌. ఇక రష్మికా ప్రేమలో పడిందని రాయొద్దు ప్లీజ్‌’’ అన్నారు రష్మికా మందన్నా. ప్రస్తుతం కార్తీతో ‘సుల్తాన్‌’, అల్లు అర్జున్‌తో ‘పుష్ప’ సినిమాల్లో నటిస్తున్నారామె.