Movies

తెలుగమ్మాయి…తెలుగు సినిమా…విలువలు

తెలుగమ్మాయి…తెలుగు సినిమా…విలువలు

మూసధోరణితో కూడిన ఒకే తరహా పాత్రలకు పరిమితం కావడం తనకు నచ్చదని అంటోంది కథానాయిక సీరత్‌కపూర్‌. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ చిత్రంలో ఆధునిక భావాలున్న యువతిగా విభిన్నమైన నటనను ప్రదర్శించి మెప్పించింది సీరత్‌కపూర్‌. తదుపరి చిత్రం ‘మా వింత గాథ వినుమా’లో సంప్రదాయాలకు విలువనిచ్చే ఆంధ్రా అమ్మాయిగా కనిపించబోతున్నది. సీరత్‌కపూర్‌ మాట్లాడుతూ “మా వింత గాథ వినుమా’లో వినిత అనే యువతిగా కనిపిస్తా. క్రమశిక్షణ, జీవితం పట్ల నిర్ధిష్టమైన లక్ష్యాలున్న ఆంధ్రా యువతిగా వైవిధ్యంగా నా పాత్ర సాగుతుంది. ‘కృష్ణ అండ్‌ హీజ్‌ లీల’ సినిమాలో పోషించిన పాత్రకు పూర్తి భిన్నమైన క్యారెక్టర్‌ ఇది. ఈ సినిమాలోని నా లుక్‌ను అభిమానులతో పంచుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్‌లకు ఆరు నెలలు విరామం తీసుకున్న ఆమె త్వరలో సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. తదుపరి సినిమాల గురించి వెల్లడిస్తూ విరామంలో కొన్ని ఆసక్తికరమైన కథలు విన్నానని, త్వరలో వాటికి సంబంధించిన వివరాల్ని వెల్లడిస్తానని సీరత్‌కపూర్‌ చెప్పింది.