* తిరుమలలో ఈ నెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ 23వ తేదీన తిరుమలకు రానున్నట్టు సమాచారం.ఏటా బ్రహ్మోత్సవాల మొదటిరోజు రాష్ట్రప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి పట్టువస్ర్తాలు సమర్పించడం ఆనవాయితీ.ఈ ఏడాది కొవిడ్-19 నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగానే నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.ఈ క్రమంలో భక్తులరద్దీ లేని కారణంగా పూర్వసంప్రదాయాన్ని పాటిస్తూ గరుడవాహనం జరిగే 23వ తేదీనే ముఖ్యమంత్రి జగన్ పట్టువస్ర్తాలు సమర్పించనున్నట్టు సమాచారం.
* కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేయగా.. కేంద్రం అన్‌లాక్ 4.0లో భాగంగా ఇస్తున్న పలు సడలింపులతో శనివారం నుంచి 80 ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే ముఖ్యమైన స్టేషన్ల మధ్య 230 రైళ్లు నడుపుతోంది. వీటికి తోడు మరో 80 రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టింది.
* ట్విట్టర్ లో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్…మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా?ఖాకిస్వామ్యంలో ఉన్నామా? అని హై కోర్టు వ్యాఖ్యానించింది అంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధమవుతోంది.జగన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసం అత్యుత్సాహం, “ఖాకిస్టోక్రసీ” ప్రదర్శిస్తున్నారు కొంత మంది అధికారులు.గతంలో కూడా ఇలానే చేసి కొంత మంది అధికారులు జగన్ రెడ్డి గారితో కలిసి ఊచలు లెక్కపెట్టారు.ఇప్పుడు పత్రికా స్వేచ్ఛని హరించడానికి కూడా వెనకాడటం లేదు.కనీసం నోటీసు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ, విచారణ అంటూ వేధింపులతో అరాచకం సృష్టిస్తున్నారు.వాస్తవాలను ప్రసారం చేశారన్న అక్కసుతో తెలుగువన్.కామ్ ఎండీ రవిశంకర్ గారి పై అక్రమ కేసు పెట్టి వేధించారు. ఈ కేసుని కోర్టు కొట్టివెయ్యడం అరాచకవాదులకు చెంపపెట్టు. పత్రికా స్వేచ్ఛని కాపాడుకోవడానికి అందరూ కలిసి పోరాడాలి.
* గ్యాస్ పై వ్యాట్ ను పెంచిన ప్రభుత్వం…గతంలో 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 24.5 శాతానికి పెంచిన రాష్ట్ర ప్రభుత్వం..కరోనా కారణంగా ఖజానాకు ఆదాయం తగ్గిపోవడంతో ట్యాక్స్ పెంచినట్లు పేర్కొన్న ప్రభుత్వం…ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుతో భారంగా మారిందని జీవోలో పేర్కొన్న ప్రభుత్వం..వ్యాట్ పెంపుతో పెరగనున్న గ్యాస్ ధరలు.
* ఐఐటీ, ఎన్‌ఐటీ తదితర ప్రఖ్యాత ఇంజినీరింగ్ కళాశాలల్లో ప్ర వేశానికి ఉద్దేశించిన ‘జేఈఈ మెయిన్స్’ ఫలితాలు శుక్రవారం వెల్లడయ్యాయి. 24 మంది విద్యార్థులు ఈ పరీక్షలో 100 పర్సంటైల్ సాధించారు. వీరిలో ఎనిమిది మంది తెలంగాణకు చెందిన విద్యార్థులే కావడం విశేషం. ఆ తరువాత స్థానంలో ఐదుగురు విద్యార్థులతో ఢిల్లీ ఉంది. రాజస్తాన్ నుంచి నలుగురు, ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, హరియాణా నుంచి ఇద్దరు, గుజరాత్, మహారాష్ట్రల నుంచి ఒక్కరు చొప్పున 100 పర్సంటైల్ సాధించారు.
* విశాఖపట్నంలో దళిత యువకుడికి శిరోముండనం కేసులో నిందితుడిగా ఉన్న నూతన్ నాయుడిపై మరో కేసు నమోదైంది. ఉద్యోగ కల్పన పేరిట నూతన్ నాయుడు భారీగా డబ్బులు వసూలు చేశాడని విశాఖలోని మహారాణిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు నమోదయ్యాయి.
* ప్రేమ పేరుతో ఓ వలంటీర్ మోసం చేశాడని యువతి ఆరోపించింది. ఏడాది పాటు మాయ మాటలతో వెంటతిప్పుకొని చివరకు అన్యాయం చేశాడని బాధితురాలు శుక్రవారం ప్యాపిలి పోలీసులకు ఫిర్యాదు చేసిం ది. మండలంలోని చిన్నపూదిళ్ల గ్రామానికి చెందిన జయక్రిష్ణ, పెద్దపూదిళ్ల గ్రామా నికి చెందిన ఓ యువతి ఏడాదిగా ప్రేమించుకున్నారు. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన వలంటీర్‌పై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐ మారుతి శంకర్‌కు ఫిర్యా దు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.
* ఊటుకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 20 మందికి కరోనా రాపిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్యాధికారి సురేష్ తెలిపారు.వాటిలో 6 కరోనా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఊటుకూరు 3, పెనుగోలను 3 కేసులు వచ్చాయని వైద్యాధికారి తెలిపారు.
* బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఎస్‌ఆర్ నగర్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవరాజ్ రెడ్డిని పోలీసులు మూడో రోజూ విచారిస్తున్నారు. మరో అనుమనితుడిగా ఉన్న సాయి కృష్ణారెడ్డిని ఆదివారం ఉదయం విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే సాయికృష్ణా రెడ్డికి పోలీసులు నోటీసులు పంపినప్పటికీ శ్రావణి అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమంలో ఉన్నందున తర్వాత వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. అతడు ఈ రోజు కూడా అక్కడే ఉండటంతో సాయంత్రం లోపు వస్తాడని సమాచారం. దీంతో సాయిని రేపు విచారించే అవకాశం ఉంది.
* అంతర్వేది ఘటన తర్వాత కుట్ర పూరితంగా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. భాజపా ఈ రాష్ట్రంలో పాగా వేసేందుకు ఇక్కడ మతపరమైన అంశాలను లేవదీస్తోందన్నారు. 2017 అక్టోబర్ 19న పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో రథం దగ్ధమైనా భాజపా- జనసేన భాగస్వాములుగా ఉన్న అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పటి ఘటనపై ప్రస్తుత భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు బాధ్యత తీసుకుంటారా? అని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం అందరూ నోరు విప్పుతున్నారని అన్నారు.
* భాజపా నాయకుల విద్వేషపూరిత ప్రసంగాలు, అభ్యంతరకర పోస్టులను ఫేస్‌బుక్ చూసీ చూడనట్లు వదిలేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై దిల్లీ అసెంబ్లీ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీ చేసింది. భారత్‌లో ఫేస్‌బుక్ ఉపాధ్యక్షుడు, మేనేజింగ్ డైరెక్టర్ అజిత్ మోహన్‌కు దిల్లీ అసెంబ్లీ శాంతిభద్రతల కమిటీ సమన్లు పంపించింది. సెప్టెంబర్ 15న విధానసభ ప్రాంగణంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాఘవ్ నేతృత్వంలోని కమిటీ నోటీసులు జారీ చేసింది. పలువురి నుంచి సేకరించిన సాక్ష్యాల ఆధారంగానే ఫేస్‌బుక్‌కు నోటీసులు జారీ చేసినట్లు కమిటీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
* దేశ రాజధాని దిల్లీ పరిసరాల్లోని మురికివాడలను, రైల్వేట్రాక్ వెంబడి ఉన్న గుడిసెలను ఖాళీ చేయించే అంశం అధికార ఆమ్ ఆద్మీ, భాజపాల మధ్య చిచ్చు రాజేస్తోంది. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి మూడు నెలల్లోగా వాటిని ఖాళీ చేయించాలని దిల్లీ ప్రభుత్వానికి కేంద్రం నోటీసులు జారీ చేసింది. అయితే కేంద్రం నోటీసులను ఆ పార్టీ అధికార ప్రతినిధి రాఘవ్ చందా చించిపారేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను భాజపా తీవ్రంగా పరిగణించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తారా? అని ఆప్‌ను ప్రశ్నించింది. కేంద్రం విధించిన గడువులోగా ఆ మురికివాడలను ప్రభుత్వం ఖాళీ చేయించకపోతే, తామే స్వయంగా చేయిస్తామని దిల్లీ భాజపా అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆప్‌కు హుకుం జారీ చేశారు.
* కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం ఏదో ఒక అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తుంటారు. ముఖ్యంగా కరోనా వైరస్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు. దానిలో భాగంగా ఆయన శనివారం ట్విటర్ వేదికగా స్పందించారు. ‘కేంద్ర ప్రభుత్వ ప్రణాళికాబద్ధమైన పోరాటం భారత్‌ను అగాధంలోకి నెట్టేసింది. దాంతో.. జీడీపీ 24 శాతం తగ్గిపోయింది, 12 కోట్ల ఉద్యోగాలు ఊడాయి, అదనంగా 15.5లక్షల కోట్ల స్ట్రెస్స్‌డ్ లోన్స్ మిగిలాయి, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. కానీ, ప్రభుత్వం, మీడియా మాత్రం అంతా బాగుందంటూ ప్రచారం చేస్తున్నాయి’ అని ట్విటర్‌లో విరుచుకుపడ్డారు.