NRI-NRT

బ్రిటన్‌లోని నగర మేయర్‌గా కన్నెగంటి చంద్ర

బ్రిటన్‌లోని నగర మేయర్‌గా కన్నెగంటి చంద్ర

బ్రిటన్‌లో తెలుగు వ్యక్తికి కీలక పదవి దక్కింది. హైదరాబాద్‌కు చెందిన జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ చంద్ర కన్నెగంటి స్ట్రోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగర డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. కౌన్సిలర్‌గా ఉన్న ఆయన ఇటీవలే డిప్యూటీ లార్డ్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ తెలుగు వ్యక్తి ఈ పదవికి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. గుంటూరు మెడికల్‌ కళాశాలలో వైద్య విద్యను పూర్తి చేసిన ఆయన స్ట్రోక్‌ ఆన్‌ ట్రెంట్‌ నగరంలో కొంతకాలంగా స్థిరపడ్డారు.