ఒహాయోలోని మేఫీల్డ్ హైట్స్‌కు చెందిన పోలవరపు కమల(27) అనే యువతి శనివారం సాయంత్రం 4:30గంటల ప్రాంతంలో బాల్డ్ రివర్ ఫాల్స్ వద్ద ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందింది. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన కమల తన బంధువు వినీల్ గోరంట్లతో కలిసి టెన్నిస్సీ పర్యటనలో భాగంగా ఈ జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లారు. జలపాతం చూస్తుండగా తాము ఇరువురము జారిపడ్డామని, తనను స్థానికులు రక్షించగా కమల ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందినట్లు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు సంఘాల ప్రతినిధులు వీరికి సహకరిస్తున్నారు.
More Local News Regarding This Accident: https://www.wbir.com/article/news/local/one-person-dead-after-drowning-at-bald-river-falls/51-01a8a273-6d52-447b-a97f-9a40374f22eb