ఒకరిది విదేశీ మంత్రం, మరొకరిది స్వదేశీ మంత్రం. ఇది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తున్న తీరు. రెచ్చగొట్టే ప్రకటనలు, ఆకట్టుకునే హామీలు.. కరోనాను పట్టించుకోకుండా ప్రచారాలు.. మొత్తమ్మీద నవంబర్ 3 ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్. మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ట్రంప్ భావిస్తుంటే.. ఎలాగైనా ట్రంప్‌ను ఓడించి డెమొక్రాట్లను అధికారంలోకి తీసుకురావాలని జో బైడెన్ భావిస్తున్నారు. అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీని తెర మీదకు తెచ్చారు ట్రంప్. తన ప్రచారంలో మోదీ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ భారతీయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రిపబ్లిక్ పార్టీ క్యాంపెయిన్‌లో మోదీ ఫోటోలతో ట్రంప్ ప్రచారం చేస్తున్నారు. నిర్ణయాత్మక రాష్ట్రాల్లో కీలకంగా మారిన భారతీయుల ఓటర్లను ఆకట్టుకునేందుకు ట్రంప్ మాస్టర్ ప్లాన్ వేశారు. గత ఏడాది హూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ వీడియోలను ప్రచారాస్త్రంగా వాడుతున్నారు.
మోడీ ఫోటోలతో ఊదరగొడుతున్న ట్రంప్

Related tags :