WorldWonders

1920 నాటి టపా ఇప్పుడు వచ్చి చేరింది

1920 నాటి టపా ఇప్పుడు వచ్చి చేరింది

’జీవిత కాలం ఆలస్యం’ అనే మాటకు ఆ తోకలేని పిట్టను ఉదాహరణగా చెప్పవచ్చు. వందేళ్ల క్రితం పంపిన ఓ పోస్ట్‌ కార్డు ఇప్పుడు ఒకరి మెయిల్‌లో ప్రత్యక్షమైంది. మిషిగాన్‌కు చెందిన బ్రిట్టనీ కీచ్‌ అనే మహిళ మెయిల్‌ చెక్‌ చేసుకుంటుండగా ఒక పోస్ట్‌కార్డు కంటబడింది. దానిపై 1920 అక్టోబరు 29 అని ఉన్న పోస్టల్‌ స్టాంపును గుర్తించి ఆమె నివ్వెరపోయిందట. రాయ్‌ మెక్‌ క్వీన్‌ అనే పేరుతో కీచ్‌ ప్రస్తుతం ఉంటున్న నివాస చిరునామా ఆ కార్డుపై ఉంది. దానిపై ఉన్న పోస్టల్‌ స్టాంపు ద్వారా అది జేమ్స్‌టౌన్‌ నుంచి పోస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోందని కీచ్‌ చెప్పారు.తాత, బామ్మలకు తమ విషయాలను తెలుపుతూ రాసిన ఆ కార్డు కింద ప్లోసీ బర్గెస్‌ అని సంతకం చేసి ఉందని.. చీపురు పట్టుకున్న పిల్లి, మంత్రగత్తె బొమ్మలు వేసి ఉన్నాయని తెలిపారు. ఈ లేఖ ఆయన సంబంధీకులకు చేరాలనే తపనతో సోషల్‌ మీడియాలో పెట్టామని, ఒకరిని బర్గెస్‌ బంధువుగా భావిస్తున్నామన్నారు.చారిత్రక వస్తువులు విక్రయించే దుకాణాల నుంచి ఇలాంటివి కొనే కొందరు.. వాటిని సంబంధీకులకు చేర్చడానికి ఇలా చేస్తుంటారని పోస్టల్‌శాఖ పేర్కొంది.