Food

మతిమరుపును దూరం చేసే దాల్చినచెక్క

మతిమరుపును దూరం చేసే దాల్చినచెక్క

వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు సహజమేనని అనుకుంటాం. అయితే వృద్ధాప్యంలో కనిపించే అల్జీమర్స్‌ వ్యాధి వల్ల జ్ఞాపకశక్తి దాదాపు పూర్తిగా పోతుంది. తీవ్రమైన మతిమరుపుగా గుర్తింపు పొందిన అల్జీమర్స్‌ వ్యాధికి దాల్చిన చెక్క దివ్యౌషధం అని పరిశోధకులు అంటున్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ద్వారా దాల్చిన చెక్కలోని సినమాల్డిహైడ్‌, ఎపికాటికిన్‌ అనే పదార్థాలు అల్జీమర్స్‌కి కారణమయ్యే కణాల పనితీరును మెరుగుపరచడం ద్వారా వ్యాధిని దూరం చేస్తాయని తేల్చారు. కాబట్టి మతిమరుపు లక్షణాలు కనబడుతుంటే దాల్చిన చెక్కను తీసుకోవడం మంచిది.