Sports

డొమినిక్ థీం…US Open 2020 Winner

డొమినిక్ థీం…US Open 2020 Winner

యూఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ టైటిల్‌ విజేతగా డొమినిక్‌ థీమ్‌ నిలిచాడు. హోరాహోరీగా సాగిన తుదిపోరులో జ్వెరెవ్‌పై థీమ్‌ అద్భుతమైన విజయం సాధించాడు. ఫైనల్‌లో 2-6, 4-6, 6-4, 6-3, 7-6 తేడాతో గెలుపొందాడు. వరల్డ్‌ నెంబర్‌వన్‌ నోవాక్‌ జొకోవిచ్‌ అనూహ్య నిష్క్రమణతో హాట్‌ ఫేవరెట్‌గా మారిన రెండో సీడ్‌ థీమ్‌ (ఆస్ట్రియా) అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ వచ్చాడు. ఆస్ట్రియా నుంచి యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలుచుకున్న తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.