బ్యాక్టీరియాకు అడ్డుకట్ట వేసే గ్రాఫీన్ మాస్కులను వేగంగా, తక్కువ ధరతో తయారుచేసే వినూత్న విధానాన్ని హాంకాంగ్ సిటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ మాస్కులు కరోనా వైరస్‌నూ ఎదుర్కోగలవని తెలిపారు. సర్జికల్ మాస్కులకు యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉండవు. అందువల్ల వాటిపై గంటల తరబడి హానికారక బ్యాక్టీరియా తిష్ఠవేసే అవకాశం ఉంది. అయితే గ్రాఫీన్ అనే పదార్థానికి యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల వాటి సాయంతో ప్రత్యేక మాస్కులు తయారుచేసే అవకాశాన్ని శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ క్రమంలో గ్రాఫీన్‌ను సులువుగా రూపొందించే విధానాన్ని కనిపెట్టారు. ‘‘కార్బన్ డైఆక్సైడ్ ఇన్‌ఫ్రారెడ్ లేజర్ వ్యవస్థను పాలీమైడ్ పొరలపై ప్రసరింపచేయడం ద్వారా త్రీడీ గ్రాఫీన్‌ను తయారుచేయవచ్చని తేలింది. సంప్రదాయ విధానాలతో పోలిస్తే ఇది తేలికైన ప్రక్రియ. దీనివల్ల గ్రాఫీన్ మాస్కులను వేగంగా, తేలిగ్గా తయారు చేయడానికి వీలవుతుంది’’ అని పరిశోధకులు తెలిపారు.
గ్రాఫీన్ మాస్క్‌తో కరోనా ఖతం
Related tags :