ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వూహాన్ ల్యాబ్‌లో తయారైందని హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ వైరాలజిస్టు డా. లి మెంగ్ యాన్ ఆరోపించారు. తన వాదనలను బలపర్చేందుకు తగిన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. హాంకాంగ్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలలో ఒకరైన లి మెంగ్ కరోనా వైరస్ వ్యాప్తికి చైనా ప్రభుత్వమే కారణమని మొదటినుంచి చెబుతూనే ఉన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సంగతి ప్రభుత్వానికి ముందే తెలుసునని ఆమె అన్నారు. పలు భద్రతా కారణాల దృష్టా‍్య ఆమె హాంకాంగ్‌నుంచి అమెరికాకు తరలివచ్చేశారు. సెప్టెంబర్ 11న ఓ షోలో ఆమె మాట్లాడుతూ కరోనా వైరస్‌పై చేసిన పరిశోధనలు.. తాను ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పంచుకుంది.
అవును…కరోనా ల్యాబ్‌లోనే తయారు చేశారు!
Related tags :