జపాన్ కొత్త ప్రధానిగా యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ(ఎల్డీపీ) సోమవారం ఆయనను తమ నేతగా ఎన్నుకున్నది. ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడిగా, ప్రధానిగా కొనసాగుతున్న షింజో అబే అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేసిన విష యం తెలిసిందే. బుధవారం సుగాను జపాన్ ప్రధానిగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఆయన 2021 సెప్టెంబరు దాకా పదవిలో కొనసాగుతారు.
ఈయనే జపాన్ నూతన ప్రధాని
Related tags :