వేపనూనెతో యాక్నే మచ్చలు పోతాయి. అంతేకాదు చర్మ సంబంధమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లను కూడా ఇది పోగొడుతుంది. ఆ విశేషాలు… అందం, ఆహారం విషయాలలో సంప్రదాయ విధానాలకు ఇపుడిప్పుడే ప్రాధాన్యం బాగా పెరుగుతోంది. వేప యాంటిసెప్టిక్‌గా పనిచేస్తుంది. అందానికి, ముఖ్యంగా యాక్నే మచ్చలు పోగొట్టడంలో వేపనూనె ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. అయితే ప్రకృతిసిద్ధమైన పరిష్కారాలు ఫలితాలను నెమ్మదిగా చూపిస్తాయి. ముఖం మీద ఉన్న యాక్నే పోవడానికి నీమ్ ఆయిల్ వాడడం వల్ల మంచి ఫలితాలు ఉన్నాయని చర్మ నిపుణులు అంటున్నారు. ముఖం మీద మచ్చలు పోయి చర్మం కాంతి వంత ం కావడానికి నీమ్ ఆయిల్‌లోని ‘నింబిదిన్’ ముఖ్య కారణమని చర్మనిపుణులు చెప్తున్నారు. ఈ నూనె కేవలం యాక్నేనే కాదు చర్మంలోని బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లని కూడా తగ్గిస్తుందంటున్నారు. యాక్నే మచ్చలను పోగొట్టడమే కాదు వేప నూనెలో మరిన్ని సుగుణాలు ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్, ఇ-విటమిన్‌లు ఉన్నాయి. ఇవి యాక్నే స్కార్స్‌ను పోగొడతాయి. విటమిన్-ఇతో పాటు అందులోని ట్రైగ్లిజరైట్స్ చర్మానికి తగినంత హైడ్రేషన్ అందిస్తాయి. ఫలితంగా చర్మం ఆరోగ్యంగా తయారయి యాక్నే మచ్చలు పోతాయి. అంతేకాదు వేపనూనె చర్మం లోపలి కణాలకు చేరి వాటిని శుద్ధి చేయగలదు కూడా. ఫలితంగా చర్మం ఎలాస్టిసిటీ మెరుగుపడుతుందని చర్మనిపుణులు చెప్తున్నారు. వేప నూనె సురక్షితమైనదే. అయితే సున్నితమైన చర్మం ఉన్నవారు మాత్రం చర్మ నిపుణుల సూచనల కనుగుణంగా వాడడం మంచిది. యాక్నే, మచ్చలపై అన్‌డైల్యూటెడ్ ఫామ్‌లో వేపనూనె వాడతారు. దూదిని ఈ ఆయిల్‌లో ముంచి మొటిమలు, యాక్నే మచ్చల మీద రాసుకుని రాత్రంతా అలాగే ఉంచుకోవాలని చర్మనిపుణులు సూచిస్తున్నారు. సంజీవని లాంటి వేపను శాస్త్రీయ సలహాల ననుసరించి వాడితే అందం, ఆరోగ్యం మీ సొంతమవుతుంది.
మొటిమలు మచ్చలకు ఇది ప్రయత్నించారా?
Related tags :