Health

తొలి కలయిక సజావుగా సాగాలంటే…

తొలి కలయిక సజావుగా సాగాలంటే…

బంధం – కాపురం

ఫస్ట్ టైమ్ సెక్స్ చేస్తున్నారా.. ఇలా చేయండి

సెక్స్ అనేది బూతు కాదు.. సృష్టి రహస్యమే ఈ కార్యం.. మరి దీనిని మొదటిసారి చేస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోండి.

బాగా వ్యక్తిగతమైన అనుభవాల్లో సెక్స్ కూడా ఒకటి. అది కేవలం శారీరకం మాత్రమే కాదు, మానసికంగా కూడా ఒకరితో మరొకరు మమేకమయ్యే అనుభవమది. కాబట్టి మీ పార్ట్నర్ తో మీరు ఎప్పుడు సెక్స్ ప్లాన్ చేసుకున్నా సరే, మీరు ఫోకస్ పెట్టాల్సిన విషయాలు కొన్నున్నాయి. పార్ట్నర్ అంగీకారం దగ్గర నుండి సేఫ్ సెక్స్ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకూ మీరు చేయాల్సినవీ, చేయకూడనివీ బోలెడన్ని విషయాలు ఉన్నాయి. సెక్సువల్ సాటిస్ఫాక్షన్ మీరూ మీ పార్ట్నర్ ఇద్దరూ అనుభవించాలంటే కొన్ని టిప్స్ మీరు ఫాలో అవ్వాలి. అవేమిటో చూడండి మరి.

ఏం చేయాలి?

1. మీ ఇద్దరికీ ఒకరితో ఒకరికి సెక్స్ అంగీకారమే కదా అన్నది తేల్చుకోవాలి. ఇది మొదటి, మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్.

2. ప్రొటెక్షన్ యూజ్ చేయాలి. సేఫ్ సెక్స్ కి రూల్స్ ఫాలో అవ్వాలి.

3. మీరు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే వారితో సెక్సువల్ రిలేషన్ మీకు తృప్తినిస్తుంది. సెక్స్ కోసమే సెక్స్‌లో ఆ తృప్తి ఉండదు.

4. మీరు కంఫర్టబుల్ గా ఉండండి. మీ పార్ట్నర్ కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేటట్లు చేయండి.

5. హడావిడి పడకండి. నెమ్మదిగా ఒక్కో స్టెప్ నీ ఎంజాయ్ చేస్తూ ముందుకి కదలండి. మీరేమీ రేస్ లో పాల్గొనటం లేదు, గుర్తు పెట్టుకోండి.

6. కంపల్సరీ గా ఫోర్ ప్లే కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ టైం సెక్స్ లో మరీ ఇవ్వాలి.

7. మాట్లాడుతూ ఉండండి. గుసగుసలాడండి. స్వీట్ నథింగ్స్ చెప్పండి. అప్పుడు కానీ సెక్స్ లో మజా అర్ధం కాదు.

ఏం చేయకూడదు?

1. మీ పార్ట్నర్ కి మీతో సెక్స్ ఇష్టమే అని మీరే అనుకోకండి. అంగీకారమే కదా అని అడిగి కనుక్కోండి.

2. అనవసరం గా ఆలోచించకండి. దీని వల్ల యాంగ్జైటీ పెరగడమే తప్ప ఏ లాభం లేదు.

3. ఫస్ట్ టైం సెక్స్ నుండి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే డిసప్పాయింట్ అవుతారు.

4. మొదటి సారే డిఫికల్ట్ పొజిషన్స్ ట్రై చేయకండి. ఫస్ట్ టైం సెక్స్ ఎప్పుడూ సింపుల్ గా సెక్సీ గా ఉండాలి.

5. ఆర్గాజం గురించే ఆలోచిస్తూ ఉండకండి. దాని మీదే దృష్టి పెడితే మీరు మిస్ అయ్యేవి చాలా ఉంటాయి.

6. మీరు స్త్రీ అయితే కేవలం కాంట్రాసెప్షన్ మీద మాత్రమ బేస్ అవ్వకండి. ప్రొటెక్షన్ కూడా యూజ్ చేయండి.

ఈ రూల్స్ తో పాటూ ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి. దీని గురించి ఆత్రపడకండి, అలాగని అవకాశాన్ని మిస్ అవ్వకండి. మీ పార్ట్నర్ తో మీ రిలేషన్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఈ స్టెప్ ఎప్పుడు తీసుకోవాలో మీకు ఆటోమేటిగ్గా తెలిసిపోతుంది.