NRI-NRT

సౌదీ ప్రవాసులకు తీపి ఖబర్

సౌదీ ప్రవాసులకు తీపి ఖబర్

సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాసులకు అక్క‌డి స‌ర్కార్ తాజాగా తీపి క‌బురు అందించింది. ప్ర‌వాసులు రీ-ఎంట్రీ వీసాలపై తమ దేశానికి వెళ్లి, కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో నిర్ణీత సమయానికి తిరిగి రాలేక‌పోయారో వారు ఇప్పుడు దేశానికి తిరిగి రావడానికి అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 15 ఉదయం 6 గంటల నుండి ప్ర‌వాసులు తిరిగి సౌదీకి రావచ్చని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది.కాగా, ప్ర‌స్తుతం వాలిడ్ వీసా గ‌ల ప్ర‌వాసుల‌ను మాత్ర‌మే త‌మ దేశానికి రావ‌డానికి సౌదీ అనుమ‌తిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఈ కొత్త ఆర్డర్‌తో గడువు ముగిసిన రీ-ఎంట్రీ వీసా, జాబ్ వీసా, విజిటింగ్ వీసాలు ఉన్నవారు తిరిగి సౌదీ వెళ్లే అవ‌కాశం ఏర్ప‌డింది. ఏదేమైనా, దేశంలోకి ప్రవేశించే ఎవరైనా స‌రే 48 గంటల ముందు జారీ చేసిన కొవిడ్ నెగటివ్ సర్టిఫికేట్ చూపించాల్సిందేన‌ని‌ సంబంధిత అధికారులు పేర్కొన్నారు.