Business

SBI ATM నుండి నగదు తీయాడానికి నూతన నిబంధన

SBI ATM నుండి నగదు తీయాడానికి నూతన నిబంధన

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే కస్టమర్లకు అలర్ట్. ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసే విషయంలో కీలక మార్పు తీసుకొచ్చింది బ్యాంకు. ఇకపై ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎస్‌బీఐ ఏటీఎంలల్లో ఓటీపీ బేస్డ్ విత్‌డ్రాయల్ సిస్టమ్ అమలులోకి వచ్చింది. అంటే ఎవరి కార్డు స్వైప్ చేస్తారో వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తేనే మెషీన్‌లో నుంచి డబ్బులు వస్తాయి. ఓటీపీ లేకపోతే డబ్బులు డ్రా చేయడం సాధ్యం కాదు. రూ.10,000 కన్నా ఎక్కువ డ్రా చేయాలంటే ఓటీపీ తప్పనిసరి చేసింది ఎస్‌బీఐ. ఇకపై మీరు ఎస్‌బీఐ ఏటీఎంలో ఎప్పుడైనా సరే రూ.10,000 కన్నా ఎక్కువ నగదు తీసుకోవాలంటే ఓటీపీ ఎంటర్ చేయాల్సిందే.