ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ శాసనసభా పక్షం ధాటికి తట్టుకోలేక సభను అర్థాంతరంగా వాయిదా వేసి పారిపోయారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం అడిగే ప్రశ్నలకు కేసీఆర్ దగ్గర సమాధానాలు లేకే సభ నుంచి పరారయ్యారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అపెంబ్లీ నిరవధిక వాయిదా పడ్డాక సీఎల్పీ నేత బట్టి, ఎమ్మెల్యేలు సీతక్క, దుద్ధిళ్ల శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించే ధైర్యంలేక టీఆర్ఎస్ ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఆరునెలల తరువాత సభా సమావేశాల సందర్భంగా జరిగిన బీఏసీ సమీటింగ్ లో 28 వరకూ అసెంబ్లీ జరుపుతాం అని చెప్పి, అవసరమైతే ప్రతిపక్షం అడిగినన్ని రోజులు సమావేశాలు నిర్వహిస్తామన్న ప్రభుత్వం… ఎప్పటిలాగానే సీఎల్పీని తట్టుకోలేక సభను వాయిదా వేసుకున్నారని ఎద్దేవా చేశారు.
? ఎఫ్.ఆర్.బీ.ఎం. బిల్లు కోసమే
ఈ శాసనసభా సమావేశాలను కేవలం ఎఫ్.ఆర్.బీ.ఎం. బిల్లుకోసమే నిర్వహించినట్లుగా ఉందని భట్టి అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి.. అప్పులు తెచ్చుకోవడం కోసం అవసరమయ్యే బిల్లు సవరణ కోసమే మీటింగ్ జరిపింనట్లు ఉందని అన్నారు. ఈ చట్టం వల్ల రాష్ట్రం పెద్ద ఎత్తున అప్పుల పాలు అవుతుందని అన్నారు.
? కృష్ణానదీ జలాలుపై చర్చ ఏదీ?
దక్షిణ తెలంగాణను ఏడారిలా మార్చేలా ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీ.ఓ. నెంబర్ 203పై అసెంబ్లీలో చర్చ జరిపకుండా కేసీఆర్ ఎందుకు పారిపోయారో ప్రజలకు చెప్పాలని ఆయన బట్టి డిమాండ్ చేశారు.
ప్రజల పక్షాన కృష్ణా నదీ జలాలను ఏపీ రోజుకు 11 టఎంసీలు తరలించుకుపోతే ఖమ్మం, నల్గండతో పాటు దక్షిణ తెలంగాణ మొత్తం ఎడారిలా మారుతుంది.. ఇంత కీలక అంశంపై సభలో చర్చించకుండా రద్దు చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై చర్చి జరిగితే కేసీఆర్ ఈసలు రూపం బయటకు వస్తుందన్న భయంతో పారిపోయారని అన్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య జరగాల్సిన చర్చను.. ప్రభుత్వం మిత్రపక్షంగా మార్చేసుకున్న ఘనత కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలన్న దుర్భుద్ధితో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అన్నారు.
? సమస్యలు ఎన్నో…??
రాష్ట్రంలో నిరుద్యోగ, వర్షాల ద్వారా నష్టపోయిన రైతులు, ఆరోగ్య, పంచాయితీ రాజ్ సెక్రెటరీలు, ఫీల్డ్ అసిస్టెంట్లు, డబుల్ బెడ్ రూమ్ కోసం ఎదురు చూస్తున్న పేదలు, కరోనాతో ఉద్యోగాలు కోల్పోయిన వారి సమస్యలు.. ఎన్నో రాష్ట్రంలో ఉన్నాయని.. వాటిపై చర్చించాలని అన్నారు. చేనేత కార్మికులు ఆరు నెలలుగా ఉపాధి లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల కోసం తీసుకువచ్చిన సబ్ ప్లాన్ మాదిరిగానే బీసీల కోసం సబ్ ప్లాన్ తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నో సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం పారిపోయిందన్నారు. టీఆర్ఎస్ సభ్యులు వంద మంది ఉన్నా.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు అడిగే ప్రశ్నలకు జవాబులు లేక పలాయన మంత్రం పఠించారని అన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్షం.. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిందని అన్నారు.
? రూ. 72 వేల కోట్లు ఎక్కడ?
హైదరాబాద్ నగరంమీద కేసీఆర్ సర్కార్ రూ.72 వేల కోట్లు ఖర్చుపెంట్టిందన్న మాటలపై భట్టి మండిపడ్డారు. మీరు ఖర్చు పెట్టిన రూ. 72 వేల కోట్లు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. వర్షం పడుతున్న ఇప్పుడు బయట రోడ్ల మీదకు వెళితే… మీరు పెట్టిన ఖర్చు ఎక్కడో కనిపిస్తుందని వ్యంగ్యంగా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అతితక్కువగా ఖర్చుతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చామని అన్నారు.
అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు, పీవీ నరసింహారావు ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే, ఇక మౌలిక వసతులు, బీ.హెచ్.ఈ.ఎల్ వంటి భారీ పరిశ్రమలు, స్టేడియంలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు తీసుకువచ్చింది కాంగ్రెస్ అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని అన్నారు. మీరు పెట్టామంటున్న ర. 72 వేల కోట్లతో ఏమి తీసుకువచ్చారో, ఏమి చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.