Movies

నాగబాబుకు కరోనా

నాగబాబుకు కరోనా

తనకు కరోనా సోకిందని వెల్లడించిన సినీనటుడు నాగబాబు. సినీ నటుడు, జనసేన నేత నాగబాబుకు కరోనా సోకింది. ఇటీవల కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. వ్యాధి వచ్చిందని బాధపడకుండా, దాని నుంచి కోలుకుని వేరొకరికి సాయం చేయాలని ఆయన అన్నారు. తాను జాగ్రత్తలు పాటించి, కరోనాని జయిస్తానని, అనంతరం ప్లాస్మా దానం చేస్తానని ఆయన చెప్పారు.