Business

మూసాపేట మెట్రో గోడలకు పగుళ్లు

మూసాపేట మెట్రో గోడలకు పగుళ్లు

లాక్ డౌన్ అనంరతం ఈనెల 7 నుంచి మెట్రో సర్వీసులు పున: ప్రారంభం అయ్యాయి. ఈ క్రమంలో కొందరు మెట్రో రైలు ఎక్కి ప్రయాణాలు చేస్తున్నారు. అయితే గోడలకు పగుళ్లు రావడంతో జనం భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ మెట్రో మరోసారి హాట్ టాపిక్‌గా నిలిచింది. మెట్రో స్టేషన్లో గోడల మీద ఏర్పడిన పగుళ్లతో ప్రయాణికులతో పాటు రోడ్లపై వెళ్తున్న జనం కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. మూసాపేటలోని మెట్రో స్టేషన్‌ గోడలతో పాటు స్టేషన్‌పైకి వెళ్లే మెట్లపై కూడా పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో భాగ్యనగరవాసులు, మెట్రో ప్రయాణికులు అటు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఎక్కడ ఏ గోడ కూలి మీద పడుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో మెట్రో నిర్మాణ సమయంలో నాణ్యత ప్రమాణాలు పాటించారా లేదా అనే అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. మెట్రో స్టేషన్ పగుళ్లకు సంబందించిన కొన్ని చిత్రాలు, అలాగే వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నారు. గతంలో కూడా ఇదే విధంగా ఓ మెట్రో రైల్వే స్టేషన్ గోడలకు పగుళ్లు రావడంతో అధికారులు పగుళ్లను నామమాత్రంగా పూడ్చేసారు. అప్పుడు కూడా ప్రయాణికులు మెట్రోస్టేషన్లకు వెళ్లేందుకు ఇదే విధంగా జంకారు. అంతే కాక గతంలోనే అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద నిలబడిన ఓ యువతిపై పైనుంచి పెచ్చులు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ వార్త పెను దుమారం రేపింది. ఇటీవలే ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో సర్వీసుల్ని అధికారులు ప్రారంభించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌తో అయిదు నెలలుగా మెట్రో స్టేషన్లు మూతపడ్డాయి. సరైన నిర్వహణ లోపం వల్లే ఈ పగుళ్లు ఏర్పడ్డాయని పలువురు భావిస్తున్నారు. త్వరగా అధికారులు స్పందించి ఈ పగుళ్లను సరిచేయాలని మెట్రో ప్రయాణికులు కోరుతున్నారు.