Movies

పూజ రెడీ

పూజ రెడీ

కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత ఒక్కొక్కరుగా సినిమాల చిత్రీకరణలో పాల్గొంటున్నారు స్టార్స్‌. తాజాగా షూటింగ్‌ ప్రారంభించారు పూజా హెగ్డే. అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో మంగళవారం జాయిన్‌ అయ్యారు పూజా హెగ్డే. ‘మళ్లీ సెట్లోకొచ్చాను’ అని తన టీమ్‌తో కలసి దిగిన ఫొటోను షేర్‌ చేశారామె. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలన్నది చిత్రబృందం ఆలోచన. ఈ రొమాంటిక్‌–ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు గోపీసుందర్‌ సంగీత దర్శకుడు.