ఈ ఏడాది ఆశ్వయుజం అధిక మాసంగా వచ్చింది. ఇది నేటి నుంచి (శుక్రవారం) మొదలవుతోంది. సౌరమాన సంవత్సరానికీ, చాంద్రమాన సంవత్సరానికీ రోజుల సంఖ్యలో వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని సమం చెయ్యడానికి నిర్దేశించిన కాలమే అధికమాసం. ఈ సమయంలో సంక్రమణం రాదు. సంక్రమణం రాని మాసాన్ని ‘అధికమాసం’ అంటారు. సంక్రమణం లేని మాసంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. వివాహాలు, ఉపనయనాలు, గృహ ప్రవేశాలను అధిక మాసంలో నిర్వహించరు. అయితే శుభ కార్యాలు వేరు, దైవ కార్యాలు వేరు. అధిక మాసంలో దైవ పూజలు తప్పనిసరిగా చేయాలి. దానధర్మాలు ఆచరించాలి. రామాయణ, భాగవతాలనూ, హనుమాన్ చాలీసానూ పారాయణం చేయడం పుణ్యప్రదం. అలాగే సత్యనారాయణ వ్రతం, గ్రహ జపాలు ఆచరించాలనీ, దానివల్ల ఫలం అధికంగా ఉంటుందన్నది పెద్దల మాట.
ఈ ఏడాది అధికమాసంగా ఆశ్వయుజం
Related tags :