వివాహానంతరం కథానాయికలకు ఫాలోయింగ్ తగ్గిపోతుందని..గతంలో మాదిరిగా సినీ అవకాశాలు కూడా రావని పరిశ్రమలో ఓ అపోహ ఉంది. మంగళూరు సొగసరి దీపికాపడుకోన్ సంపాదన చూస్తే అవన్నీ అవాస్తవాలే అనిపిస్తాయి. పెళ్లయిన తర్వాతే ఆమె కెరీర్ మరింతగా ఊపందుకుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలతో పాటు పలు అంతర్జాతీయ వ్యాపార ఉత్పత్తులకు ప్రచారకర్తగా దీపికాపడుకోన్ సంవత్సరానికి 500కోట్లు ఆర్జిస్తోందని ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఒక్కో సినిమాకు ఈ అమ్మడు పదిహేను కోట్ల పారితోషికాన్ని అందుకుంటోందట. ఇటు బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్ వేదికపై కూడా దీపికా పాపులారిటీ సంపాదించుకుంది. ఈ కారణంగా ఆమెకు అందరికంటే ఎక్కువగా డిమాండ్ ఏర్పడిందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు. ఆమె తర్వాత ప్రియాంకచోప్రా, అనుష్కశర్మ అధిక మొత్తంగా అర్జిస్తున్నారని తెలిసింది. ప్రస్తుతం దీపికాపడుకోన్ తెలుగులో ప్రభాస్ సరసన ఓ సైంటిఫిక్ థ్రిల్లర్ చిత్రంలో కథానాయికగా నటించనుంది. హిందీలో కూడా పలు భారీ ప్రాజెక్ట్‌లు చర్చల దశలో ఉన్నాయి.
₹500కోట్ల ఆర్జన!

Related tags :