WorldWonders

కుక్కల కోసం బ్లడ్‌బ్యాంక్

కుక్కల కోసం బ్లడ్‌బ్యాంక్

కుక్కల కోసం ప్రత్యేకంగా ఒక బ్లడ్ బ్యాంక్‌ను పంజాబ్‌ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. లూధియానాలోని గురు అంగద్ దేవ్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీలో కుక్కల కోసం బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. కుక్కల రోగాలకు సంబంధించి ప్రతి ఏటా సుమారు 25 వేల కేసులను చూస్తామని వెటర్నరీ డాక్టర్ శుకృతి శర్మ తెలిపారు. వీటిలో 500-600 కేసులకు సంబంధించిన కుక్కలలో హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఆయన అన్నారు. గతంలో ఒక కుక్క రక్తాన్ని మరో కుక్కకు దానం చేసేవారని డాక్టర్ చెప్పారు. ప్రస్తుతం కుక్కల కోసం ప్రత్యేకంగా బ్లడ్ బ్యాంకు ఏర్పాటు కావడంతో ఆ సమస్య లేదన్నారు. కుక్కల నుంచి సేకరించిన రక్తాన్ని రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ), ప్లాస్మా, ప్లేట్‌లెట్స్ అనే మూడు భాగాలుగా వేరు చేస్తామని చెప్పారు. హిమోగ్లోబిన్ స్థాయి తక్కువగా ఉన్న కుక్కలకు వాటిని ఎక్కిస్తామని వెటర్నరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శుకృతి శర్మ తెలిపారు.