‘‘ఒక్కో భాషలో ఒక్కో రకంగా కనిపించడం అంటూ ఏమీ ఉండదు. ఏ భాషలో అయినా సరే… తెరపై కనిపించే విషయంలో నా నియమాలు ఒకలాగే ఉంటాయి’’ అంటోంది అనుపమ పరమేశ్వరన్. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ నటించిన కథానాయికల్లో ఈమె ఒకరు. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలతో బిజీగా గడుపుతోంది. మలయాళంలో ఒక చిత్రానికి సహాయ దర్శకురాలిగా కూడా పనిచేస్తోంది. ‘‘కొత్త ప్రయత్నాలు చేయడం అంటే ఇష్టం. అందుకే సహాయ దర్శకురాలిగా కొత్త అవతారం ఎత్తా. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తానేమో. కానీ… అదెప్పుడో తెలియదు’’ అంటోందామె. తెరపైన పాత్రకి తగ్గట్టుగా, అందంగా కనిపించడమే నా కర్తవ్యమని, అంతకుమించి ఏమీ ఆలోచించనని చెబుతోంది అనుపమ. ‘‘హాట్‌గా కనిపించడం అంటుంటారు. అదెలాగో అర్థం కాదు. అందంగా కనిపించడమే నాకు తెలుసు. ఎలాంటి దుస్తులు వేసుకుంటే అందంగా కనిపిస్తాననే విషయంలో నాకు అవగాహన ఉంది. కురచ దుస్తులు ధరిస్తేనే అందంగా కనిపిస్తామనుకోవడం భ్రమ’’ అని చెప్పింది అనుపమ.
మీ భ్రమ బద్దలవ్వ!
Related tags :