Health

ఎయిరోబిక్స్‌తో మతిమరుపు దూరం

ఎయిరోబిక్స్‌తో మతిమరుపు దూరం

జ్ఞాపకశక్తి అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఇది మెరుగవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తాజాగా ఎరోబిక్స్ చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి మెరుగు అవుతుందని తేలింది.జ్ఞాపకశక్తి అనేది ప్రతీ ఒక్కరికీ అవసరమే. ఇది మెరుగవ్వాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. తాజాగా ఎరోబిక్స్ చేయడం వల్ల మెదడు ప్రశాంతంగా మారి జ్ఞాపకశక్తి మెరుగు అవుతుందని తేలింది.ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ ఒక్కరూ వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామంలోనూ రకరకాల ఎక్సర్‌సైజ్‌లు ఉంటాయి. ఇందులో కొన్ని కొన్ని చేయడం వల్ల కొన్ని లాభాలు ఉంటాయి. ఇందులో ఎరోబిక్ వర్కవుట్ చేయడం వల్ల క్యాలరీలు కరుగుతాయి. కండరాలు బలోపేతం అవుతాయని తేలింది. తాజాగా మరో విషయాన్ని గుర్తించారు నిపుణులు. అదేంటంటే.. ఎరోబిక్స్ చేయడం వల్ల మెదడు ఆరోగ్యం కూడా బాగుంటందని అధ్యయనంలో వెల్లడైంది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల పాటు ఎరోబిక్ వ్యాయామాలు చేస్తే ఆరోగ్యంపై పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. రెగ్యులర్‌గా ఎరోబిక్స్ చేయడం వల్ల గుండె ఆరోగ్యం బాగు పడుతుంది.ఎరోబిక్స్ చేయడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, డిమెన్షియా వంటి సమస్యలు దరిచేరవు. రెగ్యులర్‌గా వీటిని చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ఈ అధ్యయనంలో ప్రచురితమైంది.శారీరక పరమైన ఇతర మార్పులేమీ జరగకుండా ఉఛ్వాస, నిశ్వాసలు వేగంగా జరగటం, హృదయ స్పందన రేటు పెరగటం.. కదలికలు చురుగ్గా ఉంచేందుకు ఏరోబిక్స్ ఎక్సర్‌సైజెస్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఎరోబిక్స్ అంటే చాలా ఉంటాయి.. వాకింగ్, జాగింగ్, రన్నింగ్, స్టేషనరీ, సాధారణ సైక్లింగ్, స్విమ్మింగ్, డ్యాన్స్ వంటివన్నీ ఎరోబిక్స్‌లో భాగాలే.ఇవి చేయడం వల్ల ముఖ్యంగా ఊపిరితిత్తులు పర్యావరణం నుంచి ఆక్సిజన్ని ఎక్కువ మోతాదులో గ్రహిస్తాయి. గుండె రక్తనాళాలు ఆ ఆక్సిజన్‌ని, ఇతర పోషకాలను ప్రతి కణానికి చేరవేస్తాయి. కండరాలు పనిచేయడానికి కేలరీలను కరిగించడానికి ఇవి చాలా అవసరం. ఈ ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లను రకాలుగా చేయొచ్చు కూడా.. రెగ్యులర్‌గా కాకుండా ఇలా చేయడం వల్ల వీటిని చేయాలన్న ఉత్సాహం రెట్టింపు అవుతుంది. ఈ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల మహిళల్లో సాధారణంగా మారుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ కూడా దూరమవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.. ఎందుకంటేు ఈ వర్కవుట్ చేయడం వల్ల శరీరంలో ఈస్ట్రోజన్ విచ్ఛిన్నం అవుతుంది. మంచి మెటాబొలైట్స్ తయారయ్యేలా చేస్తాయి. ఈ కారణంగా క్యాన్సర్ సోకే అవకాశాలు తక్కువవుతాయి. కోలన్ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్ కూడా దూరం అవుతుంది.ఇక షుగర్ వ్యాధిగ్రస్తులకు ఏరోబిక్ వర్కవుట్ చాలా బాగా పనిచేస్తుందని తేలింది. దీని వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి.. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ కారణంగా బరువు కూడా అదుపులో ఉంటుంది. కండరాల బలానికి తోడ్పడుతుంది. అలాగే.. శరీరరం వదులుగా మారే గుణం కూడా తగ్గి ఫిట్‌‌గా ఉంటారు. శరీర కండరాల బలానికి కూడా ఎరోబిక్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది.రెగ్యులర్‌గా ఏరోబిక్స్ చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు దూరం అవుతాయి. ఇలా చేయడం వల్ల తర్వాత రోజు నూతనోత్సాహంతో ఉంటారు. వీటిని చేయడం అధిక రక్తపోటు తగ్గుతుంది. ఈ సమస్య రాకుండా చేస్తుంది. మంచి శరీరాకృతి మీ సొంతం అవుతుంది.ఒత్తిడి కూడా చాలా వరకూ దూరం అవుతుంది. శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ కారణాలతో మెమరీ పవర్ పెరిగినట్లు గుర్తించారు పరిశోధకాలు.. ఎరోబిక్స్ చేయడంలో మెదడులో ఎండోమార్ఫిన్లు అనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ కారణంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటారు. రెగ్యులర్‌గా ఈ వర్కువుట్ చేయడం వల్లో శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. రక్త సరఫరా మెరుగు అవుతుంది. అన్ని విధాలుగా మేలు జరుగుతుంది.. ఎప్పుడైతే శారీరకం ఎలాంటి సమస్యలు ఉండవో.. అప్పుడే మనసు కూడా బావుంటది. ఇలా మానసికంగా, శారీరకంగా బావున్నప్పుడు మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. ఈ కారణంగా జ్ఞాపకశక్తి బాగుంటుంది అని పరిశోధనలు తేల్చాయి.నడి వయసు దాటిన వారు నుంచి వయసు మళ్లిన వారు ఈ ఎరోబిక్స్ చేయడం వల్ల మతిమరుపు వంటి సమస్యలు దూరం అవుతాయి. అదే విధంగా.. స్టూడెంట్స్ చేయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కాబట్టి వీటిని ఎవరైనా రెగ్యులర్‌‌గా చేయడం వల్ల లాభాలు నిపుణులు చెబుతున్నారు.