Movies

తప్పులు చేయకూడదని తెలిసింది

తప్పులు చేయకూడదని తెలిసింది

అలా చేయకూడదని ఇప్పుడు అర్థమైంది. ఇకపై ఆ తప్పు చేయను అంటోంది నటి రష్మికమందనా. ఇంతకీ ఏమిటీ అమ్మడు చేసిన తప్పు. ఇప్పుడు ఏం అవగతం అయ్యింది? లాంటి సందేహాలు కలుగుతున్నాయా? ఇప్పుడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్లలో ఒకరిగా వెలిగిపోతున్న నటి రష్మిక. ఒక్క అడుగు జీవితాన్ని మార్చేస్తుంది అన్నట్లుగా ఈ కన్నడ భామ జాతకాన్ని గీతగోవిందం అనే ఒక్క చిత్రం మార్చేసింది. అలా టాలీవుడ్లో రాత్రికి రాత్రే స్టార్ అయిన నటి రష్మిక అని చెప్పవచ్చు. ఈ తరువాత నటించిన ఏ చిత్రం పెద్దగా ఆడకపోయినా స్టార్ హీరోలతో నటించే అవకాశాలు ఈ చిన్నదానికి వరుస కట్టేస్తున్నాయి. తెలుగులో మహేశ్బాబు, అల్లుఅర్జున్ వంటి స్టార్స్తో జత కట్టేస్తోంది. ఇక కోలీవుడ్లోనూ ఈ అమ్మడి జోరు మొదలైంది. ఇక్కడ కార్తీకి జంటగా సుల్తాన్ అనే చిత్రంలో నటిస్తోంది. దీంతో రష్మికలో చాలా మార్పు వచ్చేసిందంటున్నారు సినీ వర్గాలు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి కాబట్టి పారితోషికం విషయంలో ఎటూ పెంచేసిందనుకోండి.