* బెజవాడ కేంద్రగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు.అన్ లైన్ లో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ పై భారీగా బెట్టింగ్ లు నిర్వహించిన ముఠా.బెజవాడలో ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్న తూర్పు గోదావరి జిల్లా ముఠా.పోలీసుల అదుపులో నిందితులు.అన్ లైన్ సెటప్ స్వాధీనం చేసుకున్న పోలీసులు.మొగల్రాజపురంలో ఆచార్య ప్లే స్కూలులో క్రికెట్ బెట్టింగ్.అవతార్ అనే యాప్ ద్వారా ఈ బెట్టింగ్ నడిపిస్తున్నారు.బాగా తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ బెట్టింగ్ యాప్ లో ఆడతారు.12 లక్షల వరకూ బెట్టింగ్ జరుగుతోందని సమాచారం వచ్చింది.ప్రధాన సూత్రధారి నవీన్ ను త్వరలో అదుపులోకి తీసుకుంటాం.
* ఈ రోజు నిరూప్ నగర్ తండా కు చెందిన చింతకింది లక్ష్మినారాయణ ఒక కార్ లో ప్రబుత్వ నిషేదిత అంబర్ బ్యాగ్ లు బీదర్ నుండి తెచ్చుకొని తన ఇంట్లో పెడుతున్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్స్ నంది రామ్, మధు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఇంటికి వెళ్ళి చూడగా తన ఇంటి ముందు ఒక హోండా కార్ ఉండి, దానిలో అంబర్ బ్యాగులు కలవు, మరియు లక్ష్మినారాయణతో పాటుగా ఒక వ్యక్తి కలడు. ఆ కార్ ను మరియు కార్ లో ఉన్న 10 అంబర్ బ్యాగులను సీజ్ చేసి లక్ష్మినారాయణ ను విచారించగ నేను మరియు మా గ్రామానికి చెందిన మునవత్ రాజు లము కలిసి కార్ ను కిరాయి తీసుకొని బీదర్ కు వెళ్ళి అక్కడ అంబర్ బ్యాగులను కొనుక్కొని వచ్చి ఇంట్లో పెడుతుండగా పట్టుకున్నారని తెలిపాడు.
* ద్వారాకతిరుమల మండలం తిరుమలంపాలెం గ్రామానికి చెందిన మైనర్ బాలికని(17) ప్రేమ పేరుతో మోసం చేసిన మాగంటి నాగరాజు (23).
* కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ మండలం కడంబా అడవుల్లో శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించినట్లు జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ సత్యనారాయణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. ’రెండు రోజుల కిందట ఆసిఫాబాద్ పట్టణం సమీపంలోని చీలేటిగూడకు మంచిర్యాల, కుమురంభీం జిల్లాల డివిజన్ కమిటీ కార్యదర్శి మైలారపు అడెల్లు ఆలియాస్ భాస్కర్ వచ్చినట్లు అందిన సమాచారంతో పోలీసులకు గాలింపును ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా శనివారం తిర్యాణి మండలంలోని దంతన్‌పల్లిలో మావోయిస్టులకు చెందిన నాలుగు సంచులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మహారాష్ట్ర వైపు వెళ్లే కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్, బెజ్జూరు మండలాల్లోని అటవీ ప్రాంతాలను, రహదారులను ఎనిమిది ప్రత్యేక దళాలతో జల్లెడ పడుతున్నారు.