తిరుమల కొండపై విమానం చక్కర్లు. స్పందించిన ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్.
ప్రఖ్యాత తిరుమల పుణ్యక్షేత్రం కొండపై చాలా తక్కువ ఎత్తులో ఈ విమానం ప్రయాణించింది.
బ్రహ్మోత్సవాల వేళ నిబంధనలకు విరుద్ధంగా విమానం రావడంతో పలువరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఆగమశాస్త్రం ప్రకారం తిరుమల క్షేత్రంలో విమానాలు తిరగడంపై నిషేధం ఉందని అంటున్నారు.
ఇక ఈ వివాదంపై ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ సురేష్ స్పందించారు. తిరుమలలో విమానం వెళ్లిన మాట వాస్తవమేనని ఆయన అన్నారు.
విమానయాన శాఖకు చెందిన నావిగేషన్ సర్వే విమానం తిరుమల మీదుగా వెళ్ళిందని,అయితే తిరుమల శ్రీవారం ఆలయం మీదుగా ఆ విమానం వెళ్లలేదని తెలిపారు.
ఆలయానికి కొద్దిగా దూరం నుంచి ప్రయాణించిందని, తిరుమలపై విమాన రాకపోకలకు ఎలాంటి ఆంక్షలు లేవని పేర్కొన్నారు.
తిరుమల కొండను నో ఫ్లై జోన్‌గా ప్రకటించలేమని గతంలో కేంద్రం స్పష్టం చేసిందని, అయినప్పటికీ అనధికారికంగా తిరుమల నో ఫ్లై జోన్‌గా కొనసాగుతోందని వివరణ ఇచ్చారు.