కొంతమంది నాలుక ఎర్రగా ఉంటే మరికొందరి నాలుక తెల్లగా ఉంటుంది. తెల్లని నాలుకకు కారణం వారు నోటిని శుభ్రం చేసుకోకపోవడమే. దీన్ని ఇలానే వదిలేస్తే నాలుక ఎర్రబడడం, వాపు, గడ్డలు వంటి సమస్యలు మొదలవుతాయి. నాలుక మీద ఈ గడ్డలు బ్యాక్టీరియా, ఆహారం, ధూళి, చనిపోయిన కణాలను కూడా ట్రాప్ చేస్తాయి. అసలు నాలుక తెల్ల బడడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం.
* నోరంతా ఎండిపోవడం వల్ల నాలుక తెల్లగా మారుతుంది.
* శరీరం డీహైడ్రేట్ అయితే నాలుక కూడా డీహైడ్రేట్‌కు గురవుతుంది. దీని కారణంగా కూడా నాలుక తెల్లగా మారుతుంది.
* జ్వరం వచ్చినప్పుడు నోరంతా చేదువుగా ఉంటుంది. దీనికి కారణంగా నాలుక తెల్లబడటమే.
* ల్యోకోప్లాకియా : ధూమపానం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అరుదైన సందర్భాల్లో నోటి క్యాన్సర్‌గా అభివృద్ది చెందే అవకాశం ఉంది.
* పొగాకు నమలడం, ధూమపానం చేయడం వల్ల నాలుక ఎక్కువగా తెల్లబడుతుంది.
* అధికంగా మద్యం తాగడం వల్ల కూడా ఇలా మారుతుంది.
* సాఫ్ట్‌ఫుడ్ తినడం వల్ల కూడా నాలుక రంగు మారుతుంది.
* నాలుకను వ్యతిరేకంగా రుద్దడం వల్ల కూడా కలర్ చేంజ్ అవుతుంది.
* తెల్లనాలుకను గమనించినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ కింది లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది. 8
లక్షణాలు :
* నాలుక మీద మంట
* ఆహారం నమలడం, మింగేటప్పుడు, మాట్లాడేటప్పుడు నొప్పి ఉన్నప్పుడు వైద్యుడిని సంప్రదిచాలి.
* బరువు తగ్గడం
* చర్మం మీద దద్దుర్లు ఏర్పడటం.
* సడన్‌గా జ్వరం రావడం.
ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం వైద్యుడిని సంప్రదించాలి.