Business

ఒక గుడ్డు ధర ₹6 అంట!

ఒక గుడ్డు ధర ₹6 అంట!

కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.
సామాన్య ప్రజలు కొనలేని పరిస్థితి.

భారీగా పెరిగిన కోడిగుడ్ల ధరలు.
లాక్‌డౌన్‌ కాలంతో పోలిస్తే రెట్టింపు.
డిమాండ్‌కు తగ్గ ఉత్పత్తి లేక పెరిగిన గుడ్డు ధర.

నల్లగొండ : కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఉల్లి ఘాటెక్కిస్తుండగా గుడ్డు కొండెక్కి కూర్చుంది.

ఈ ధరలు లాక్‌డౌన్‌ కాలంతో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపయ్యాయి.

కరోనాను ఎదుర్కోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో గుడ్డు తప్పని సరిగా తినాల్సిన పరిస్థితి.

దీంతో వీటికి డిమాండ్‌ బాగా పెరిగింది.దానికి అనుగుణంగా సరఫరా లేకపోవడంతో రెట్టింపు అయిన ధరలతో పేదలు కొనలేకపోతున్నారు.

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండాలన్నా.. కరోనా సోకిన వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలన్నా రోజూ గుడ్లు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.

దీంతో చాలామంది రోజూ తప్పనిసరిగా గుడ్డు తింటున్నారు.

ఈ నేపథ్యంలో వీటికి డిమాండ్‌ భారీగా పెరిగింది. అందుకు తగిన ఉత్పత్తి లేకపోవడంతో కొరత ఏర్పడింది.

దీంతో ఒక్కో గుడ్డు ధర రూ.6 వరకు పెరిగింది.