ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్‌పై అమెరికా విధించిన నిషేధాన్ని వారంపాటు వాయిదా వేశారు. ఈ నిషేధం పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉన్నట్లు సమాచారం. యాప్ కార్యకలాపాలు కొనసాగేలా అమెరికన్ కంపెనీలతో కలిసి టిక్‌టాక్ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్వయంగా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్, ఒరాకిల్, వాల్‌మార్ట్ కలిసి అమెరికాలో యాప్ కార్యకలాపాలు కొనసాగించేందుకు ఏర్పాటు చేయబోయే కొత్త కంపెనీకి శ్వేతసౌధం సహకారం ఉంటుందన్నారు. దీంతో ఈ మూడు కంపెనీలు కలిసి టెక్సాస్ కేంద్రంగా ‘టిక్‌టాక్ గ్లోబల్’ అనే మరో కొత్త సంస్థను నెలకొల్పుతున్నట్లు తెలిసింది. దీంతో మరో 25 వేల కొత్త ఉద్యోగాలు రాబోయే అవకాశం ఉందని ట్రంప్ అన్నారు. పౌరుల సమాచారానికి 100శాతం భద్రత లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
టెక్సాస్‌లో 25వేల కొత్త ఉద్యోగాలు కల్పించనున్న టిక్‌టాక్

Related tags :