PVNR శతజయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కెనడాలోని టొరంటో నగరంలో పీవీ నరసింహారావు శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కె.కేశవరావు, బోయిన్‌పల్లి వినోద్ కుమార్, పి.వి.ప్రభాకరరావు, మహేష్ బిగాల తదితరులు జూం ద్వారా హాజరయ్యారు. కె.కేశవరావు మాట్లాడుతు PVNRకి సరైన గుర్తింపు కోసం KCR మరియు TRS ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల గురించి వివరించారు. పీవీ తెచ్చిన భూ సంస్కరణ వల్ల ఎంతో మందికి మేలు జరిగింది, పీవీ సాదాసీదా జీవితాన్ని గడిపారని కొనియాడారు. ఆయనలోని స్థితప్రజ్ఞత ఆదర్శమని అన్నారు. బోయిన్‌పల్లి వినోద్ కుమార్ మాట్లాడుతు ప్రపంచవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరగటం చాలా గొప్ప విషయమని ఆయనకు భారతరత్న గౌరవానికి కృషి చేస్తామన్నారు. మహేష్ బిగాల వివిధ దేశాల్లో PVNR విగ్రహం ఏర్పాటు ప్రయత్నాలు, ఉత్సవాల ప్రణాళికల గురించి వివరించారు. కెనడాలో పీవీ మార్గ్ పెట్టె ఆలోచనలో ఉన్నామని తెలిపారు. పీవీకి భారతరత్నకై https://www.change.org/BharatRatnaforPV చూడాలని కోరారు. పి.వి.ప్రభాకరరావు మాట్లాడుతు మంచి మేధస్సు మంచి మనస్స్సు ఉండటం చాలా అరుదు అని, ఈ రెండు పీవీ విషయములో ఉన్నాయని అన్నారు. కృష్ణ కోమండ్ల, వేణు, సాయి రామకృష్ణ, లలిత్, మధు, కరుణకర్ రావు, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
టొరంటోలో ఘనంగా పీవీ జయంతి
Related tags :