Editorials

RFCకి పోటీగా ఆదిత్యనాథ్ ప్రణాళికలు

UP CM Yogi Adityanath Announces New Disappointment To Ramoji Film City

ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు రెండు పెద్ద‌ ఫిలింసిటీలున్నాయ‌నే సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ శివార్ల‌లోని రామోజీఫిలింసిటీ, ముంబై ఫిలింసిటీలుండ‌గా..ఈ రెండింటిలో రామోజీఫిలింసిటీలో అత్య‌ధికంగా సినిమా షూటింగ్స్ అవుతుంటాయి. అయితే కొత్త‌గా దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ ఏర్పాటు కాబోతుంది. ఇంత‌కీ ఎక్క‌డ అనుకుంటున్నారా..? నోయిడాలో అతిపెద్ద ఫిలింసిటీ ఏర్పాటుకు యూపీ సీఎం యోగిఆదిత్యానాథ్ ప్లాన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. మీడియా స‌మావేశంలో సీఎం యోగిఆదిత్యానాథ్ మాట్లాడుతూ..దేశానికి మంచి ఫిలింసిటీ అవ‌స‌రం ఉంద‌ని, యూపీ ఫిలిం సిటీ ఏర్పాటు చేసే బాధ్య‌త తీసుకుంటుంద‌ని చెప్పారు. స్టూడియో ఏర్పాటుకు గ్రేట‌‌ర్ నోయిడా, య‌మునా ఎక్స్ ప్రెస్ వే ప్రాంతాల‌ను ప‌రిశీలించాల‌ని అధికారుల‌కు సూచించారు. దీంతో దేశంలో అన్ని ర‌కాల ప్రొడ‌క్షన్స్ ప‌నులు చేసుకునేందుకు అవ‌కాశ‌ముండ‌టంతోపాటు చాలా మందికి ఉపాధి దొరుకుతుంద‌ని చెప్పారు.