DailyDose

ఆత్మహత్య చేసుకున్న హెడ్‌కానిస్టేబుల్-నేరవార్తలు

Telugu Crime News - Head Constable Commits Suicide

* రాజ‌స్థాన్ రాజ‌ధాని జైపూర్‌లో దారుణం జ‌రిగింది. జైపూర్‌లోని సామోద్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా ప‌నిచేస్తున్న‌‌ శ్రీరామ్ త‌న స‌ర్వీస్ రివాల్వ‌ర్‌తో కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. తాను నివాసం ఉంటున్న పోలీస్ క్వార్టర్స్‌లోనే ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టాడు. ఈ ఘటన స్థానికంగా క‌ల‌క‌లం రేపింది. స‌మాచారం అందిన వెంట‌నే పోలీస్ ఉన్న‌తాధికారులు ఘ‌ట‌నా ప్రాంతానికి చేరుకుని తోటి పోలీసుల నుంచి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. మృతుని దగ్గర ఒక‌ సూసైడ్ నోట్ కూడా లభ్యమయ్యింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమ‌వారం ఉదయం మిగ‌తా సిబ్బంది అంతా విధుల‌కు హాజ‌రైనా హెడ్ కానిస్టేబుల్ శ్రీరామ్ మాత్రం స్టేషన్‌కు రాలేదు. ఫోన్ రింగ‌వుతున్నా లిఫ్ట్ చేయ‌లేదు. దీంతో తోటి పోలీసులు శ్రీరామ్ ఉంటున్న క్వార్టర్స్‌కు వెళ్లి చూడ‌గా అస‌లు విష‌యం వెలుగుచూసింది. దాంతో వారు వెంట‌నే ఉన్న‌తాధికారుల‌కు స‌మాచారం ఇచ్చి శ్రీరామ్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మానసిక‌ ఒత్తిళ్ల‌ను త‌ట్టుకోలేకే త‌ట్టుకోలేకే శ్రీరామ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది.

* ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం రాగసముద్రం గ్రామానికి చెందిన రావూరు.యోహాను (47) అనే రైతు అప్పుల బాధలు తాళలేక మరియు కుటుంబ సమస్యలతో తన పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు మార్కాపురం జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు విషయం తెలుసుకున్న తాడివారిపల్లె ఎస్. ఐ ఆవుల.వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

* ఆర్ధిక అవసరాలను ఆసరాగా చేసుకుని, తక్కువ వడ్డీకి రుణం ఇప్పిస్తామని నమ్మించిన కొందరు తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఓ మహిళ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న ఓ యువతికి తక్కువ రేటుకే బ్యాంకు లోన్ ఇప్పిస్తామని నమ్మబలికి, హోటల్ గదికి పిలిపించి ఐదుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌నకు పాల్పడిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఓ మహిళ సహ ఆరుగురిపై పోలీసులు కేసు నమోదుచేశారు. న్యూఢిల్లీ డిప్యూటీ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. టూరిస్ట్ గైడ్‌గా పనిచేసే ఓ మహిళ.. ఇండియా గేట్ సమీపంలోని ఫైవ్‌స్టార్ హోటల్‌లో తనపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు ఫిర్యాదు చేసిందని తెలిపారు.

* కేరళలోని ఎర్నాకుళంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరికొందరు కూడా మృతి చెందివుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కలాడీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పేలుడు ఒక భవనంలో చోటుచేసుకంది. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. మృతులను తమిళనాడుకు చెందిన పెరియానాన్, కర్నాటకకు చెందిన డీ నాగాగా పోలీసులు గుర్తించారు.

* లాక్ డౌన్ తో స్కూళ్లు, కాలేజీలు మూతబడటంతో.. అందరూ ఆన్ లైన్ క్లాస్ లవైపు దృష్టిమళ్లించారు. అయితే ఆన్ లైన్ క్లాసుల వల్ల కొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి. తమిళనాడులోని తిరవల్లూరు జిల్లా పొన్నెరీ అరుమంతై గ్రామంలో ఆన్ లైన్ క్లాసులు ఓ విద్యార్థిని ప్రాణం తీశాయి. చెన్నైలోని భారతీ ఉమెన్స్ కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని దర్శిని.. ఆన్ లైన్ క్లాసులు వింటోంది. అయితే ఆ క్లాసులు తనకు అర్థం కావడంలేదంటూ తల్లికి చెబుతూ వచ్చింది. నిదానంగా అర్థం అవుతాయిలేమ్మా అని తల్లి సర్దిచెప్పినా ఫలితం లేకపోయింది. క్లాసులు అర్థం కావడంలేదని, అందరిలా తాను చదువుకోలేకపోతున్నాననే బాధతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చోళవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పంగడిపల్లి రహదారిలో గల శ్రీ సాంబశివ మోడరన్ రైస్ మిల్ లో పెద్ద మొత్తంలో రేషన్ బియ్యం పట్టివేత.

* ద్వారకాతిరుమల మండలం రాళ్ల కుంటలో పురుగుమందు తాగి మృతి చెందిన గంటా నవీన్(38).

* తిరుపతిలో రౌడీ షీటర్ దారుణ హత్య…తిరుపతి గిరిపురంలో తన నివాసానికి సమీపంలో ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపారు.తిరుపతి ఐస్ మహల్ సమీపంలో హారిక బార్ ఎదురుగా ఘటన….మృతి చెందిన వ్యక్తి దినేష్ గా గుర్తింపు.

* సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో పదో రోజు సీబీఐ అధికారులు కడపలో విచారణ చేశారు.కడప జైలు అతిథిగృహంలో సాక్షులు, అనుమానితులను ప్రశ్నిస్తున్నారు.వివేకాతో ఆర్థిక, ఇతర సంబంధాలున్న వ్యక్తులను అధికారులు విచారణకు పిలిపించారు.ఇవాళ కడప, పులివెందుల, కర్నూలుకు చెందిన ఆరుగురిని వారు ప్రశ్నించారు.