ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు పూర్తి అయ్యింది. ESI కుంభకోణంలో 70రోజులు జైల్లో ఉన్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ఆ పార్టీ అధిష్ఠానం సిద్ధమైనట్టు సమాచారం. ఈ నెల 27న అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్నారు. ఆయన స్థానంలో మళ్లీ బీసీకే పట్టం కట్టనున్నారు. పార్టీ కొత్త కమిటీలను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించనున్నారు.
70రోజులు జైల్లో ఉన్న అచ్చెన్నకు ఏపీ తెదేపా బాధ్యతలు
Related tags :