టీనేజీ వయసు అనగానే…అందరికీ సరదాలూ, సంతోషాలే కనిపిస్తాయి. కానీ ఈ వయసులో అమ్మాయిలకు బోలెడు ఒత్తిళ్లూ ఉంటాయంటారు మానసిక నిపుణులు. అవి చదువూ, కుటుంబం, ఆర్థిక పరిస్థితులూ, అందం, ప్రేమ…ఇలా చాలానే ఉంటాయి. దాన్నుంచి త్వరగా బయటపడలేకపోతే క్రమంగా కుంగుబాటుకీ గురవ్వొచ్ఛు మరి దీని బారిన పడకూడదంటే…మీకు ఇబ్బంది కలిగించే, మీరు ఒత్తిడికి గురయ్యే ఏ అంశం ఏదైనా సరే మీరు మనసులో పెట్టుకున్నంత మాత్రాన అది పరిష్కారమైపోదు. కొన్నిసార్లు వాటి నుంచి బయటపడలేక కొత్త చిక్కుల్లో ఇరుక్కునే ప్రమాదం ఉంది. అందుకే అది ఏదైనా సరే మీ మనసుకి దగ్గరైన వారికి (అమ్మానాన్నా, స్నేహితులూ, అధ్యాపకులూ, బంధువులు) చెప్పడం అలవాటు చేసుకోండి. అప్పుడే మీరు ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఒకవేళ మీరు మీ బాధలనూ, భావాలను మరొకరితో పంచుకోవడానికి ఇష్టపడకపోతే… వాటిని రోజూ ఒక డైరీలో రాసుకోండి. ఖాళీ సమయంలో వాటిని ఒకసారి చదువుకోండి. ఇలా చేయడం… మీరు మరింతగా బాధపడటానికి కాదు. సమస్య మీరు ఊహించుకున్నంత పెద్దది కాదు అనే భావన తీసుకురావడానికి. ఇలా చేస్తే బయటపడేందుకు ఓ చక్కటి ఆలోచన తట్టొచ్ఛు మీలోని భావాలకు ఇది అద్దంలా ప్రతిబింబిస్తుంది. ఆ పుస్తకం మీకొక స్నేహితురాలిగా మారుతుంది.
టీనేజీ అమ్మాయిలకు కొన్ని సలహాలు
Related tags :