Sports

ఫ్రెంచ్ ఒపెన్‌పై కరోనా పడగ

ఫ్రెంచ్ ఒపెన్‌పై కరోనా పడగ

కరోనా ఉగ్రరూపంతో దాదాపుగా ఆరు నెలల పాటు క్రీడా సంబరాలు జరగలేదు. పెద్ద పెద్ద ఈవెంట్లు సైతం వాయిదా పడ్డాయి. అభిమానులకు వినోదాన్ని పంచటానికి ఇప్పుడిప్పుడే అవి తిరిగి ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెన్నిస్‌ అభిమానులు ఎదురు చూస్తున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ టోర్నమెంట్‌ పారిస్‌లోని రోనాల్డ్‌ గ్యారోస్‌ మైదానంలో సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 11 వరకూ జరగనుంది. దీనికి సంబంధించి నిర్వహకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. టోర్నమెంట్‌లో భాగంగా సోమవారం నుంచి క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో పాల్గొనే ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేయగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు ఒక కోచ్‌ సైతం కొవిడ్‌ బారిన పడ్డారు. మరో ముగ్గురు ఆటగాళ్లు కోచ్‌కు సన్నిహితంగా ఉండటంతో మొత్తం అయిదుగురు ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.