Business

ఇక ఆర్టీసీ బస్సుల్లో పక్కపక్కనే కుర్చోవచ్చు

APSRTC Removes Social Distancing Rule In Its Buses

ఆర్టీసీ బస్సుల్లో ఇకపై సీట్ల పూర్తి సామర్థ్యం మేర ప్రయాణికులను అనుమతించాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. లాక్‌డౌన్‌ అనంతరం మే 21 నుంచి ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించినా.. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా సగం సీట్లకే అనుమతిచ్చారు. ఆన్‌లైన్‌లో సగం సీట్లే అందుబాటులో ఉండేలా సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం పూర్తి సామర్థ్యం మేర సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. దీంతో ఆన్‌లైన్‌లో అన్ని సీట్లు అందుబాటులోకి వచ్చేలా మార్పులు చేయనున్నారు.