నువ్వులు తింటే ప్రోటీన్ అందుతుందా..ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం. నాన్ వెజిటేరియన్స్‌కి ఈ ప్రొటీన్ ఈజీగా అందుతుంది.. మరి వెజిటేరియన్స్‌కి ఏ పదార్థాల ద్వారా లభిస్తుందో తెలుసుకోండి..ఎక్సర్సైజ్ వల్ల స్ట్రెంత్, ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అయితే డైట్, న్యూట్రిషన్ ఇన్‌టేక్ వల్ల హెల్త్, ఎనర్జీ బిల్డ్ అవుతాయి. కావాల్సిన రిజల్ట్స్ పొందడానికి చాలా రకాల డైట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ వేగన్స్ కి కావాల్సినన్ని ప్రొటీన్ సోర్సెస్ లేవని చాకా మంది అనుకుంటూ ఉంటారు. అయితే, ఇది ఒక అపోహ మాత్రమేననీ, వేగన్స్ కి సరిపోయే ప్రొటీన్ సోర్సెస్ కావాల్సినన్ని ఉన్నాయనీ నిపుణులు చెబుతున్నారు. పైగా ఇవి ఫ్రెండ్లీ కూడా అని అంటున్నారు. నువ్వులు తింటే ప్రోటీన్ అందుతుందా..
1. పిస్తా
పిస్తా ని ఆన్-ద-గో స్నాక్ అని పిలవచ్చు. పైగా ఇందులో హై ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. మీకిష్టమైన రెసిపీస్ లో పిస్తాని యూజ్ చేసుకోవచ్చు. ఒక కప్పు పిస్తా లో ఇరవై ఐదు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
2. ఆల్మండ్ బటర్
ఆల్మండ్ బటర్ లో పీనట్ బటర్ కంటే ఎక్కువగా ఫైబర్, కాల్షియం, పొటాషియం, ఐరన్ ఉంటాయి. మీ ఓట్ మీల్, స్మూతీల్లో ఒక స్కూప్ ఆల్మండ్ బటర్ వేసుకోండి. లేదా బనానా మీద స్ప్రెడ్ చేసుకోండి. లేదా టోస్ట్ మీద యూజ్ చేయండి. రెండు టేబుల్ స్పూన్ల ఆల్మండ్ బటర్ సర్వింగ్ లో ఏడు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
3. పీ ప్రొటీన్
వేగన్ ప్రొటీన్ ఆప్షన్స్ లో పీ ప్రొటీన్ చాలా పాప్యులర్. ఇది తేలికగా డైజెస్ట్ అవుతుంది. ఇందులో మజిల్ బిల్డ్ చేయడానికి బాడీకి కావాల్సిన ఎమైనో ఆసిడ్ ఉంది. ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు త్వరగా నీరసం రాకుండా చేసే ఎమైనో ఆసిడ్ ఉంది. పోస్ట్ వర్కౌట్ స్మూతీల్లో దీన్ని కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. రెండు టీ స్పూన్ల పీ ప్రొటీన్ సర్వింగ్ లో పద్నాలుగు గ్రాముల ప్రొటీన్ ఉంది.
4. స్పిరులినా
ప్రొటీన్ అధికం గా ఉండే ఇంకొక సోర్స్ స్పిరులినా. దీన్ని మార్నింగ్ స్మూతీలో కానీ, జ్యూస్ లో కానీ యాడ్ చేసుకోవచ్చు. వంద గ్రాముల స్పిరులినా లో యాభై ఏడు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అయితే దీని యావరేజ్ సర్వింగ్ మాత్రం ఒకటి నుండి మూడు గ్రాములు.
5. చియా సీడ్స్
చియా సీడ్స్ లో ప్రొటీన్ సమృద్ధిగా ఉండడమే కాదు, ఫైబర్ కూదా ఎక్కువగానే ఉంటుంది. రెండు టీ స్పూన్ల సర్వింగ్ లో ఐదు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
6. నువ్వులు
నువ్వుల్లో లిగ్నన్స్ పుష్కలం గా ఉంటాయి. ఇవి కొవ్వు కరిగించే లివర్ ఎంజైంస్ ని బాగా ప్రొడ్యూస్ చేయడం వలన వీటిని తీసుకుంటే త్వరగా కొవ్వు కరుగుతుంది. వీటిలో వేగన్ ప్రొటీన్ కూడా ఎక్కువగానే ఉంది. మూడు టీ స్పూన్ల సర్వింగ్ లో ఐదు గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
అయితే, ఈ వేగన్ ప్రొటీన్ సోర్సెస్ ని మిక్స్-ఎండ్-మ్యాచ్ పద్ధతిలో తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. అలాగే, మీ క్యాలరీస్ లో ఇరవై శాతం ప్రొటీన్ నుండి వచ్చేలా చూసుకోవాలి.