అవసరాల్లో ఉన్న వారికి సాయం చేయడంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ ముందుంటారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆపన్నహస్తం అందించి, మంచితనం చాటుకున్నారు. ఆయన తాజాగా తన వీరాభిమానికి స్వయంగా ఫోన్ చేసి, సర్‌ప్రైజ్ చేశారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎ.పి. ముత్తుమణికి రజనీ అంటే చాలా ఇష్టం. అందుకే 45 ఏళ్ల క్రితం ఆయన అభిమాన సంఘం ఏర్పాటు చేశారు. రజనీకి సంబంధించి ఫ్యాన్ క్లబ్ ఏర్పాటు చేసిన తొలి వ్యక్తి ఆయన కావడం విశేషం. గత కొన్ని రోజులుగా ముత్తుమణి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ చేరడంతో చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అతడి పరిస్థితిని అభిమాన సంఘాల ద్వారా తెలుసుకున్న రజనీ స్వయంగా ఫోన్ చేసి, ధైర్యం చెప్పారు. గత 20 రోజులుగా మానసికంగా కుంగిపోయి ఉన్నానని ఆడియోలో ముత్తు తలైవాకు చెప్పారు. తొలుత మదురైలో చికిత్స జరిగిందని, ఆ తర్వాత చెన్నై ఆసుపత్రిలో చేరానని అన్నారు. త్వరలోనే కోలుకుంటావని, నీ కోసం ప్రార్థిస్తానని రజనీ ధైర్యం చెప్పారు. ఆ తర్వాత ఆయన భార్యతో కూడా రజనీ మాట్లాడారు. తన దైవంగా భావించే రజనీ ఫోన్ చేయడం వల్ల ఉత్సాహం వచ్చిందని ముత్తు చెప్పారట.
అందుకే ఆయన పేరు రజనీకాంత్
Related tags :