DailyDose

తిరుపతిలో ప్రతిపక్షాల గృహనిర్బంధం-నేరవార్తలు

Telugu Crime News - Opposition Leaders House Arrested In Tirupati

* మ‌ల్కాజ్‌గిరి ఏసీపీ న‌ర్సింహారెడ్డి నివాసంలో తెలంగాణ రాష్ర్ట అవినీతి నిరోధ‌క శాఖ‌(ఏసీబీ) అధికారులు సోదాలు చేస్తున్నారు.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీపీ నివాసంతో పాటు ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏకకాలంలో 12 చోట్ల అధికారులు సోదాలు చేస్తున్నారు.గ‌తంలో ఉప్ప‌ల్ సీఐగా న‌ర్సింహారెడ్డి ప‌ని చేశారు.అయితే ఆయ‌న అనేక భూత‌గాదాల్లో త‌ల‌దూర్చినట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ఏసీపీ న‌ర్సింహారెడ్డి రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి. హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, అనంత‌పూర్‌లో సోదాలు కొన‌సాగుతున్నాయి. 

* శేషాచలంలో వన్యప్రాణులను వేటాడుతున్న ఇద్దరి అరెస్ట్. నాటు తుపాకీ స్వాధీనంఎర్ర చందనం స్మగ్లర్లు కోసం కూంబింగ్ చేస్తున్న టాస్క్ ఫోర్స్ కు అడవి జంతువులను వేటాడుతున్న ఇద్దరు వేటగాళ్లు చిక్కారు.వారి వద్ద నుంచి ఒక నాటు తుపాకీ, మందు గుండు సామగ్రి, వంట చేసుకునేందుకు అవసరమయ్యే పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రెండు మద్యం బాటిళ్లను కూడా వారి వద్ద లభించాయి.టాస్క్ ఫోర్స్ డీఎస్పీ వెంకటయ్య ఆదేశాల మేరకు ఆర్ ఎస్ ఐ లింగాధర్, ఎఫ్.బి.ఓ. జానీ బాషా బృందం చామల రేంజ్, వెల్లంపల్లి రిజర్వు ఫారెస్టులో మంగళవారం రాత్రి నుంచి కూంబింగ్ చేపట్టగా, బుధవారం ఉదయం భాకరాపేటకు చెందిన మధు (45), ఎల్లమ్మగుడి బండకు చెందిన రమణయ్య (48) తారసపడ్డారు.

* గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం రహదారిలో ట్రాక్టర్ బోల్తా..ఇద్దరు కార్మికులు మృతి.

* మహారాష్ట్ర భీవండిలో భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య బుధవారం నాటికి 33కి పెరిగింది.43 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం సోమవారం తెల్లవారు జామున 3.40గంటలకు కూలిన విషయం తెలిసిందే.ఈ భవనంలో 40 ఫ్లాట్లు ఉండగా, అందులో సుమారు 150 మంది నివసిస్తున్నారు.మూడు రోజులుగా థానే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్, ఎన్డీఆర్ఎఫ్‌ రెస్క్యూ ఆపరేషన్‌ పనులు కొనసాగిస్తున్నాయి.సుమారు వంద మందికిపైగా సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు.థానే నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భీవండిలో ఎక్కువగా పవర్‌ లూం కార్మికులు నివసిస్తుంటారు.

* తిరుపతిలో టీడీపీ, బీజేపీ నేతల గృహానిర్భంధం★ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ హౌస్ అరెస్ట్.★ బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి ఇంటివద్ద ఉద్రిక్తత.★ ఇంటి నుంచి ఎవరు బయటకు రాకుండా గేటు వద్దే కూర్చున్న పోలీసులు.★ పోలీసుల తీరుపై మండిపడ్డ బీజేపీ నాయకులు.★ తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్ హౌస్ అరెస్ట్.★ ఇంటివద్ద భారీగా మోహరించిన పోలీసులు.★ పుంగనూరు టీడీపీ ఇన్ ఛార్జ్ అనీషారెడ్డి, శ్రీనాథరెడ్డిల హౌస్ అరెస్ట్.★ సత్యవేడు టీడీపీ ఇన్ చార్జ్ రాజశేఖర్ హౌస్ అరెస్ట్.★ మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి హౌస్ అరెస్ట్. గేటుకు తాళాలు వేసిన పోలీసులు.★ అమర్నాథ్ రెడ్డి ఇంటివద్దకు భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు.