WorldWonders

అక్కడ గంజాయి కలిపిన బీరే స్పెషల్

అక్కడ గంజాయి కలిపిన బీరే స్పెషల్

*సాధారణంగా కేఫ్​లో ఏం దొరుకుతాయి? మెదడుకు ఉల్లాసాన్నిచ్చే కాఫీ-టీలు, రుచికరమైన స్నాక్స్​… అంతేనా! మరి కేఫ్​లో గంజాయి విక్రయిస్తే..? ఆహార పదార్థాల్లో గంజాయి ఉత్పత్తులను కలిపి అమ్మితే? అదీ చట్టబద్ధంగానే వీటి విక్రయాలు జరిగితే? ఏంటీ షాక్ అవుతున్నారా? ఈ కథనం పూర్తిగా చదివితే మీకే క్లారిటీ వచ్చేస్తుంది.
*మీరు చూస్తున్నది హాంకాంగ్​లోని ఫౌండ్ కేఫ్. ఈ కేఫ్​లో కాఫీ, టీ, బిస్కెట్లతో పాటు బీరు కూడా లభిస్తుంది. ఇందులో ఏం విశేషం లేకపోయినా.. వీటిలో కలిపే పదార్థంలోనే ఉంది అసలు విషయం. కన్నాబిడోల్(సీబీడీ) అనే గంజాయి నూనె కలిపి తమ ఉత్పత్తులను అతిథులకు అందించడం ఈ కేఫ్ ప్రత్యేకత.
*ఆస్ట్రేలియాలోని పెర్త్​కు చెందిన ఆల్టమ్ ఆసియా లిమిటెడ్ సంస్థ ఈ కేఫ్​ను ఏర్పాటు చేసింది. ఆల్టమ్ సంస్థ.. ఆసియా-పసిఫిక్ దేశాలకు కన్నాబినోయిడ్ ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆసియాలో సీబీడీ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు హాంకాంగ్ ఓ మంచి ప్రదేశమని ఈ సంస్థ సహవ్యవస్థాపకుడు ఫియాచ్ర ముల్లెన్ అభిప్రాయపడుతున్నారు.గంజాయి మొక్కలో వందల కొద్ది రసాయనాలు ఉంటాయి. ఇందులో టీహెచ్​సీ, సీబీడీ ముఖ్యమైనవి. ఈ సీబీడీ మత్తుకారకం కాకపోయినా.. దీనికి విశేషమైన ఔషధ లక్షణాలు ఉన్నాయని చెబుతారు. ఆహార ఉత్పత్తులతో పాటు సీబీడీతో నూనెలు, బాడీ క్రీమ్​లు, లోషన్లు, పెంపుడు జంతువులకు ఉపయోగించే ఆయిళ్లు సహా శునకాల కోసం బిస్కెట్లనూ తయారు చేస్తారు.
*సీబీడీ చట్టబద్ధమేహాంకాంగ్​లో గంజాయి చట్టబద్ధం కాదు. కానీ ఈ కేఫ్ కన్నాబిడోల్ (సీబీడీ)ను ఉపయోగిస్తోంది. స్థానిక చట్టాలకు అనుగుణంగానే వీటిని వాడుతోంది. గంజాయిలో ఉండే మత్తుపదార్థమైన టీహెచ్​సీ సున్నా కంటే తక్కువ స్థాయిలో ఉంటేనే.. సీబీడీకి హాంకాంగ్​లో అనుమతిస్తారు. ఈ ఉత్పత్తులపై ప్రజల్లో ఉన్న అపోహలను తమ కేఫ్ తొలగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కేఫ్ వ్యవస్థాపకుడు ముల్లెన్.అమెరికాకు చెందిన లైఫ్ కంపెనీ నుంచి ఈ సీబీడీని దిగుమతి చేసుకుంటోంది ఫౌండ్ కేఫ్. ఈ సీబీడీ 99 శాతం స్వచ్ఛంగా ఉంటుందట.
*సీబీడీ బీర్లు కూడాకాఫీలే కాకుండా..
ఆల్టమ్ సంస్థ తయారు చేసే బీర్లలోనూ సీబీడీ నూనెను కలిపి కస్టమర్లకు అందిస్తున్నారు. హెయిర్​ అనే బ్రాండ్​నేమ్​తో వీటిని తయారు చేస్తున్నారు. గతనెలలోనే వీటిని మార్కెట్లోకి వదలగా.. హాట్​కేకుల్లా అమ్ముడైపోయాయి. బీరుతో సీబీడీని కలిపి తీసుకుంటే ఆ మజానే వేరంటున్నారు సంస్థ బ్రాండ్ అంబాసిడర్ స్టెల్లా లో.
*కాఫీ అద్భుతం’కేఫ్​కు వచ్చే కస్టమర్లు ఈ ఉత్పత్తులపై మనసుపారేసుకుంటున్నారు. సీబీడీ కాఫీ వల్ల తాము రోజంతా హాయిగా ఉంటున్నట్లు చెబుతున్నారు.
*మరి ధర?
ఓ.. వీటి ధరెంతో చెప్పలేదు కదా! సీబీడీ జతచేసిన కోల్డ్ కాఫీని సుమారు రూ.760(80 హాంకాంగ్ డాలర్లు)కు విక్రయిస్తున్నారు. సీబీడీ బీరు క్యాన్​ను రూ.664, సీబీడీ మూన్​కేక్​ను రూ.360కి అమ్ముతున్నారు.ఫౌండ్​ కేఫ్ ప్రస్తుతం ప్యాక్​డ్ ఉత్పత్తులనే విక్రయిస్తోంది. అనుమతులు వచ్చిన తర్వాత తాజాగా తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. అందువల్ల.. ఒక ప్రాకేజ్డ్ ఉత్పత్తి కొంటే కాఫీ ఉచితంగా అందిస్తోంది ఈ కేఫ్. అక్టోబర్ నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.