బీజేపీ అంటే బహుత్ బోల్నేకా పార్టీ అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. ‘తెరాసా చేతల పార్టీ అని బీజేపీ మాయమాటల పార్టీ’ అని ఆయన విమర్శలు గుప్పించారు. రాయపోల్ మండల కేంద్రంలో 266 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లుడూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన రెవెన్యూ చట్టం రైతులకు మేలు చేస్తుందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం బోరు బావుల వద్ద మీటర్లు పెట్టాలని అంటోందని, తెలంగాణ ప్రభుత్వం వద్దంటోందని తెలిపారు. గతంలో చంద్రబాబు కూడా మీటర్లు పెట్టాలని చూస్తే, ప్రజలు చంద్రబాబు మీటర్లే పీకారని ఎద్దేవా చేశారు. తి ఎకరాకు కాళేశ్వరం నీరు రావాలంటే టిఆర్ఎస్ పార్టీ కి ఓటేయాలని పిలుపునిచ్చారు. కరోనా కారణంగా ఆదాయం తగ్గి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు తగ్గలేదని హరీష్ రావు అన్నారు.
అదొక డబ్బా పార్టీ
Related tags :