NRI-NRT

ట్రంప్…అత్యాశ

ట్రంప్…అత్యాశ

అత్యున్నత నోబెల్‌ పురస్కారాన్ని దక్కించుకోవాలనే కోరికతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ భారత్‌, చైనాల మధ్య రాయబారం నడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. అరబ్‌ దేశాలు, ఇజ్రాయల్‌ మధ్య సత్సంబంధాల స్థాపన యత్నానికి గాను ఆయన పేరు ఇటీవల నోబెల్‌ బహుమతికి నామినేట్‌ అయిన సంగతి తెలిసిందే. మధ్య ప్రాచ్యంలో శాంతి స్థాపనకు కృషి చేసినందుకు నార్వే పార్లమెంట్‌ సభ్యుడు క్రిస్టియన్‌ తైబ్రింగ్‌ జెడ్డే ట్రంప్‌ను నోబెల్‌ శాంతి పురస్కారానికి నామినేట్‌ చేశారు. కాగా ఈ విషయంపై మీడియా అడిగిన ప్రశ్నకు ‘‘ప్రస్తుతం చైనా, భారత్‌ల మధ్య సరిహద్దు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఆ దేశాల మధ్య ఎక్కువగా విభేదాలు చోటుచేసుకున్నట్టు నేను గమనించాను. వాటిని ఇరుదేశాలు సామరస్యంగా పరిష్కరించుకుంటాయని ఆశిస్తున్నాను. అయితే ఈ విషయంలో మేము ఏదైనా సహాయం చేయగలిగితే.. సంతోషంగా చేస్తాము. రెండు నోబెల్‌ బహుమతులకు నామినేట్‌ కావటం గొప్ప గౌరవమే కదా! అయితే ఏం జరుగుతుందో వేచి చూద్దాం..’’ అని జవాబిచ్చారు.